ప్రతి కేసుకూ.. ప్రతి దాడికీ.. బదులు తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురజాల సందీప్ మహదేవ్ అక్రమ అరెస్టు అత్యంత దుర్మార్గం. సోషల్ మీడియాలో పోస్టు పెట్టారనే నెపంతో అరెస్టు చేసి.. ఆచూకీ కూడా చెప్పకుండా తిప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. డీజీపీ కార్యాలయానికి, పోలీస్ బెటాలియన్ కు మధ్యలో, సీఎం నివాసానికి సమీపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ గూండాలు మారణాయుధాలతో తెగబడినా.. పోలీసులు పట్టించుకోలేదు. కానీ.. సోషల్ మీడియాలో ఏదో పోస్టు పెట్టారంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టడం పోలీసుల నీతిమాలిన తనానికి నిదర్శనం.
సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు పెడితే.. అరెస్టు చేస్తారా అంటూ గతంలో సుప్రీంకోర్టు పోలీసుల్ని హెచ్చరించింది. దేశంలోని ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) నొక్కిచెబుతుందని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
Read Also:టీడీపీ నేత మహదేవ సందీప్ నాయుడు అరెస్ట్
అయినా రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టడం, అరెస్టు చేసి.. ఆచూకీ కూడా చెప్పకుండా తిప్పడం దుర్మార్గం. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎంత వేధించినా.. ప్రతి ఘటనకూ వడ్డీతో సహా చెల్లిస్తాం. టీడీపీ నేత సందీప్ పై వేధింపులు ఆపకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. రాజ్యాంగం విధించిన లక్ష్మణ రేఖలను మీరితే శిక్షలు తప్పవు. ఈ విషయాన్ని గుర్తించి గురజాల సందీప్ మహదేవ్ ను తక్షణమే విడుదల చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఒక ప్రకటనలో హెచ్చరించారు.
తాజావార్తలు
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!