రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుప్తె సీమ నేతల సదస్సులో కీలక తీర్మానం చేసారు. అయితే కృష్ణానదీ యాజమాన్య బోర్డు తొలిదశలో తీసుకోబోతున్న 15 నీటి ప్రాజెక్టుల జాబితాలో తెలంగాణలోని ప్రియదర్శిని జూరాల లేకపోవడం అన్యాయం అన్నారు. కర్ణాటక నుండి కృష్ణా జలాలు జూరాల నుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించాలి. కీలక ప్రాజెక్టు కృష్ణాబోర్డు ఆధీనంలో లేకపోతే పక్క రాష్ట్రం అనధికారిక నీటివినియోగానికి పాల్పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెంటనే జూరాలను బోర్డు పరిధిలోకి చేర్చాలని ఈ సదస్సు డిమాండ్ చేస్తోంది అన్నారు. తెలంగాణ నీటి విషయంలో ఆరాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంతో మాట్లాడుకుని వారికి అనుకూలంగా కేంద్రజలశక్తి శాఖ నిర్ణయాలుండేలా చూసుకుంటున్నారు. కేసుల భయంతో కేంద్రాన్ని, లాలూచీ రాజకీయాల వల్ల కేసీఆర్ ను ప్రశ్నించలేక సీఎం జగన్ తన అసమర్థతను చాటుకుంటున్నారని ఈ సదస్సు భావిస్తోంది. జగన్ చేతగాని తనం, అవినీతి రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుకు శాపాలుగా మారాయని సదస్సు ప్రకటిస్తోంది అని పేర్కొన్నారు.