మరోసారి టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు, టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.. నిన్న చంద్రబాబు నివాసం దగ్గర హల్‌చల్ చేసి అరెస్ట్ అయిన ఆయన.. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.. సీఎం వైఎస్ జగన్‌ను, మంత్రులను అసభ్యంగా తిట్టడం వెనుక చంద్రబాబు స్క్రిప్ట్ ఉందని ఆరోపించిన ఆయన.. చంద్రబాబు ఇంటికి నిరసన తెలపటానికి వెళ్తే నాపై దాడి చేశారని మండిపడ్డారు.. కాల్ మనీ సెక్స్ రాకెట్ చేసిన వాళ్లు, గూండాలు, రౌడీలతో చంద్రబాబు దాడి చేయించారని ఆరోపించిన జోగి రమేష్.. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సంచలన కామెంట్లు చేశారు.. అయ్యన్నపాత్రుడి ని సస్పెండ్ చేస్తారో లేక మెచ్చి జాతీయ అధ్యక్షుడిని చేస్తారా? మీ ఇష్టం కానీ.. ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు.. ఇది ఆరంభం మాత్రమే.. నోరు అదుపులో పెట్టుకోకపోతే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు.. ఇక, మేం కూడా నిన్నటి ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం అన్నారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్.