Tadipatri: గత కొన్ని రోజులుగా తాడిపత్రి నగరం రాజకీయ కక్షల నేపథ్యంలో అట్టుడుకుతోంది. ఓవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మరోవైపు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు తాడిపత్రిలో రాజకీయ వాతావరణాన్ని మరింత పెంచుతున్నారు. ఇదివరకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావడానికి కూడా అనుమతి ఇచ్చింది. కానీ, ఆ సమయంలో కూడా తాడపత్రి నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తాజాగా ఆక్రమణలు జరిగాయని మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది తాడిపత్రి మున్సిపల్…
టీడీపీ నేత సుధాకర్ నాయుడు హత్యకు కుట్రలో ట్విస్ట్ నెలకొంది. అనంతపురం డీఎస్పీ ఆఫీసులో టీడీపీ నేత సుధాకర్ నాయుడు ప్రత్యక్షమయ్యారు. ఉదయం నుంచి సుధాకర్ నాయుడు హత్యకు కుట్ర అని జోరుగా ప్రచారం జరిగింది. కానీ.. ఆయన విచారణ నిమిత్తం డిఎస్పీ ఆఫీస్‌కు వచ్చారు. దాదాపు గంటన్నర పాటు సుధాకర్ నాయుడును డిఎస్పీ శ్రీనివాసులు విచారించారు. విచారణ అనంతరం మీడియాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారు.
కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత సంజన్న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 14న శరీన్ నగర్ లో దారుణ హత్యకు గురయ్యారు. రాజకీయ ఆధిపత్య పోరు హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా కర్నూలులో టీడీపీ నేత సంజన్న హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు మందిని అరెస్ట్ చేశారు. వద్దే రామాంజనేయులు, రేవంత్, తులసి, శివకుమార్,…
Kuna Venkatesh Goud: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూన వెంకటేష్ గౌడ్ నిన్న (శుక్రవారం) రాత్రి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు.
ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకరుగా బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. బుచ్చయ్య చౌదరితో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారానికి మంత్రులు నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు వెళ్లారు.
ర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో మాచాని సోమనాథ్ ఆధ్వర్యంలో వేలాది చేనేతలతో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మాచాని సోమనాథ్ ఆధ్వర్యంలో వేలాది సంఖ్యలో చేనేతలు కలిసి ర్యాలీగా బయలుదేరి పద్మశ్రీ మాచాని సోమప్ప విగ్రహానికి పూలమాలవేసి, అనంతరం చేనేతల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
మార్కాపురంలో టీడీపీ నేతల భూకబ్జా బాగోతం బట్టబయలైంది. కోట్ల రూపాయలు విలువ చేసే భూములను అక్రమంగా పేదల నుంచిస్వాధీనం చేసుకున్న భూదందా నియోజకవర్గంలో సంచలనంగా మారింది.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు టీడీపీ శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారి రావత్ కు లేఖ రాసినా వివరాలు ఇవ్వకపోవడంతో మంత్రి బుగ్గనకు ఆయన లేఖ రాశారు.
లోకేశ్ సన్నిహితుడు, టీడీపీ నేత గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో ఐటీ సోదాలు చేపట్టింది. నారా లోకేశ్‌కు ప్రధాన అనుచరుడిగా ఉన్న గుణ్ణం చంద్రమౌళి ఇంట్లో మూడు బృందాలుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.