జల్లయ్య హత్యను మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఖండించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యుల పరామర్శించేందుకు పల్నాడుకు బుద్దా వెంకన్న బయలు దేరడంతో.. అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడం వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో బుద్దా వెంకన్నని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తుందని, హత్యలు చేయమని సీఎం ప్రొత్సహిస్తున్నారన ఆయన ఆరోపించారు. అందుకే వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవడం లేదని, పల్నాడులో ముగ్గురు…
నిన్న కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి స్పందిస్తూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏం జగన్ మోహన్ రెడ్డి.. ఇప్పటికైనా మారవా..? అంటూ చురకలు అంటించారు. పెట్రోలుపై 31 శాతం వ్యాట్ + రూ.4+రూ.1.. డీజిల్ పై 22.5 శాతం వ్యాట్ +రూ.4, +రూ.1 పన్నులు వేసి 151…
ఇటీవల సంభవించిన అసని తుఫాన్ వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లరావు. రాష్ట్రంలో అసని తుఫాను ప్రభావం వల్ల పంటలు నష్టపోయారన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ లో ఉచిత విద్యుత్ అని గొప్పలు చెప్పకునే ముఖ్యమంత్రి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం దారుణం అన్నారు. గుంటూరు జీజీహెచ్‌లో ఆరాధ్య అనే చిన్నారి ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతికి…
హైదరాబాద్ నగరంలో గంజాయి తరలిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో నమోదైన ఓ గంజాయి కేసులో ఏపీ టీడీపీ మహిళా నేత జాహ్నవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలు గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన టీడీపీ నాయకురాలిగా పోలీసులు గుర్తించారు. 2013లో నమోదైన కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. Read Also: Pregnant Walking: భర్త వేధింపులు….గర్భిణీ 65 కిలోమీటర్ల నడక గంజాయి తరలింపులో ఎన్‌డీపీసీ యాక్ట్…
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఆకస్మిక మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. బొజ్జల మృతికి సంతాపం తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఓమంచి సహచరుడిని , ఆత్మీయుడిని కోల్పోయానంటూ సదరు ప్రకటనలో పేర్కొన్నారు. బొజ్జల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు కేసీఆర్ కూడా టీడీపీలో కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పార్టీకి చెందిన పలువురు కీలక…
ఏపీలో జరుగుతున్న వివిధ సంఘటనలపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. చిలమత్తూరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్ హెచ్చార్సీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడు వేణుగోపాల్ పై ఎస్ఐ దాడి చేసిన వీడియోను ఎన్ హెచ్చార్సీకి పంపించారు వర్ల. సత్యసాయి జిల్లా, చిలమత్తూరు ఎస్.ఐ రంగడుపై చర్యలు తీసుకోవాలని వర్ల లేఖలో కోరారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ లో…
ఏపీ అసెంబ్లీలో సమావేశం అయింది ప్రివిలేజ్ కమిటీ (Privilege Commitee). కమిటీ ముందు హాజరయ్యారు టీడీపీ నేత కూన రవి కుమార్. ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. గతంలో స్పీకర్ పై ఆరోపణలు చేసిన కూన రవికుమార్ పై విచారణ జరిపాం అనీ, గతంలో వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పాం. అప్పుడు ఆయన రాలేదు. ఈరోజు వ్యక్తిగతంగా హాజరయ్యారని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధనరెడ్డి చెప్పారు. కూన రవి కుమార్ చేసిన…
Andhra Pradesh CM Jagan Fired on TDP MLA’s at Assembly Meetings Today. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో సంభవించిన మరణాలపై చర్చించాలంటూ టీడీపీ ఎమ్మెల్యే పట్టుబట్టారు. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో కొద్దిసేపు స్పీకర్ రద్దు చేశారు. అనంతరం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. సహజ మరణాలకు కూడా టీడీపీ వక్రీకరిస్తోందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా చంద్రబాబు…
పోలవరం నిర్వాసితులకు అంతా బాగుందని కేంద్రమంత్రికి జగన్ చెప్పించే ప్రయత్నం చేశారని టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమా అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పునరావసం కింద ఎన్ని ఇళ్లు, ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా చెప్పలేని పరిస్థితిలో సీఎం ఉన్నారని, దాదాపు లక్ష కుటుంబాలకు కట్టాల్సిన ఇళ్లపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి పోలవరం పరిశీలనకు వస్తే రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి అడ్రస్ లేడని, జరిగిన పనులు…
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాల విభజనపై వైసీపీ నేతలకు స్పష్టత లేదని ఆయన విమర్శించారు. నెల్లూరును విడదీయవద్దని మేము ఎప్పుడో చెప్పామని, వైసీపీ నేతలు ఒక్కొరు ఒకో విధంగా మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రిని కలిసే దమ్ము సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. కానీ సంబరాలు చేసుకుంటున్నారని, కొందరు నేతలు విభజనను వ్యతిరేకిస్తున్నారని…