బాలిక ఆత్మహత్య కేసులో టీడీపీ నేత వినోద్‌కుమార్ జైన్‌కు జీవిత కాల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. సెక్షన్ 305 కింద జీవితకాల జైలుశిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పోక్సో యాక్ట్ 9,10 సెక్షన్ల కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (67) కన్నుమూశారు. నెల రోజుల క్రితం గుండెపోటుకు గురైన ఆయన విజయవాడ రమేశ్ ఆస్పత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణం పట్ల టీడీపీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
దేవేందర్‌గౌడ్ అంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీలో నంబర్-2 అనే టాక్ ఉండేది. ఆరోగ్యంతోపాటు వివిధ కారణాల వల్ల చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన పేరు ఇప్పుడు అనూహ్యంగా తెర మీదికి వచ్చింది. ఎందుకంటే దేవేందర్‌గౌడ్ అప్పుడెప్పుడో పెట్టి తీసేసిన పొలిటికల్ పార్టీని లేటెస్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ఈసీఐ) తన లిస్టు నుంచి డిలీట్ కొట్టింది. ఆ పార్టీ పేరు నవ తెలంగాణ పార్టీ. నిజానికి ఆ పార్టీ పేరు మొదట్లో ఇదే. కానీ…
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జైళ్ళ శాఖ డీజీకి లేఖ రాశారు. న్యాయమూర్తి ఆదేశాలు లేకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ ఎమ్మెల్సీ అనంతబాబుకు వీఐపీ సౌకర్యాలు కల్పిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పెద్ద నేరస్తుడికి రాజమండ్రి సెంట్రల్ జైలు సిబ్బంది, అధికారులు స్టార్ హోటల్ సౌకర్యాలు కల్పిస్తున్నారు. రిమాండ్ ఖైదీకి అటువంటి సౌకర్యాలు కల్పించేందుకు అనుమతి ఇవ్వలేదని కోర్టు అధికారులు చెప్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా అనంతబాబుకు ప్రత్యేక గది కేటాయించి, రెండు సెల్‌ఫోన్లతో నిత్యం…
ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. సోషల్ మీడియాతో నిరాధరమైన పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. టీడీపీ నేతల సోషల్ మీడియా ఖాతాలను ఫోర్జరీ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్న అధికార వైసీపీ మద్దతుదారులపై కేసులు నమోదు చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. దురుద్దేశంతో రెండు రాజకీయ వర్గాల మధ్య…