Tadipatri: గత కొన్ని రోజులుగా తాడిపత్రి నగరం రాజకీయ కక్షల నేపథ్యంలో అట్టుడుకుతోంది. ఓవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మరోవైపు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు తాడిపత్రిలో రాజకీయ వాతావరణాన్ని మరింత పెంచుతున్నారు. ఇదివరకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రిలోకి రావడానికి కూడా అనుమతి ఇచ్చింది. కానీ, ఆ సమయంలో కూడా తాడపత్రి నగరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తాజాగా ఆక్రమణలు జరిగాయని మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసింది తాడిపత్రి మున్సిపల్ సిబ్బంది. ఇందులో భాగంగానే నేడు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద సర్వే చేస్తామని నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
Kantara Chapter1 : సినిమా బడ్జెట్ మొత్తం ఓటీటీ డీల్ తో రికవరీ చేసిన కాంతార
తాడిపత్రి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి ఇప్పటికే ఓసారి కొలతలు వేశారు అధికారులు. కానీ, మరోసారి ఆ ఇంటి కొలతలను వేయనున్నారు ఆక్రమణల నేపథ్యంలో. ఇకపోతే ప్రస్తుతం కేతిరెడ్డి పెద్దారెడ్డి తిమ్మపల్లి నివాసంలో ఉంటున్నారు. కొలతల నేపథ్యంలో ఆయన నేడు తాడిపత్రికి వస్తారనే అనుమానంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనితో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసాల వద్ద భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కారణంగా తాడిపత్రి నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Drunk Driving: మద్యం మత్తులో లవర్తో బెట్టింగ్.. సముద్రంలోకి కారు.. చివరకు?