కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత సంజన్న హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈనెల 14న శరీన్ నగర్ లో దారుణ హత్యకు గురయ్యారు. రాజకీయ ఆధిపత్య పోరు హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజాగా కర్నూలులో టీడీపీ నేత సంజన్న హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు మందిని అరెస్ట్ చేశారు. వద్దే రామాంజనేయులు, రేవంత్, తులసి, శివకుమార్, అశోక్ లను పోలీసులు అరెస్టు చేశారు.
Also Read:Sri Sathyasai District: పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్.. రైళ్ల రాకపోకలకు అంతరాయం
ఎస్పీ విక్రాంత్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. హత్యకు గురైన వ్యక్తికి, నిందితుల కుటుంబాల మధ్య గొడవలున్నాయని చెప్పారు. ఇదే విషయమై పరస్పరం కేసులు పెట్టుకున్నారని వెల్లడించారు. విభేదాలు ముదరడంతో వద్దే అంజి, ముగ్గురు కుమారులు కలసి కత్తులు, వేట కొడవళ్ళతో టీడీపీ నేత సంజన్నపై దాడి చేసి హత్య చేశారని తెలిపారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసాం.. రౌడీ షీటర్లపై నిఘా పెంచామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు.