ఏపీ టీడీపీలో మరో వికెట్ పడింది. అంటే పార్టీ నుంచి వెళ్లడం కాదండోయ్.. జైలుకు వెళ్లడం. టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సెంట్రల్ జైళ్లకు వెళ్లడం కామనై పోయింది. అచ్చెన్న, కొల్లు అరెస్ట్ అయినా వెనక్కి తగ్గని ఉమా! ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్టు అయ్యారు. దమ్ముంటే తనను అరెస్టు చెయ్యాలంటూ రెండేళ్లుగా సవాళ్లు చేస్తున్న ఈ మాజీ మంత్రిని వైసీపీ ప్రభుత్వం…
పవర్ పోవడంతో.. ఢీలాపడ్డ ఆయనకు గట్టిగానే ఎదురు దెబ్బలు తగిలాయి. రానురానూ వాటికి అలవాటు పడిపోయారో ఏమో.. ఎవరైనా తమ బాధలు చెబితే.. వెయిట్ ప్లీజ్ అంటున్నారట. మన టైమ్ వచ్చే వరకూ ఓపిక పట్టాలని ప్రవచనాలు ఇస్తున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా హితోక్తులు? అచ్చెన్న మాటల్లో దూకుడు లేదా? ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి తాజా వైఖరి తెలుగు తమ్ముళ్లను ఆశ్చర్య పరుస్తోంది. అధికారంలో ఉన్నా.. విపక్షంలోకి జారినా మొన్నటి వరకు దూకుడుగా…
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం చనుగొండ్ల గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకుడు గోపాల్ ఆత్మహత్య తనను తీవ్రంగా కలచివేసిందని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. అతని తల్లిదండ్రులు స్తోమత లేకపోయినా రెక్కల కష్టంతో గోపాల్ ను ఉన్నత చదువులు చదివించారని తెలిపారు. రెండేళ్ల పాటు జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూసిన గోపాల్, తనకు ఉద్యోగం లేదని మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయం మరే ఇతర…
దేశంలో కొత్త ఫ్రంట్ పై చర్చలు మొదలయ్యాయి. ప్రాంతీయ పార్టీల అగ్రనేతలు ఫ్రంట్ పై అడుగులు వేస్తున్నారు. మరి దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలు ఎటువైపు? 2019 ఎన్నికల ముందు యాంటీ మోడీ ఉద్యమం చేసిన టీడీపీ చీఫ్ ఇప్పుడు ఏం చేస్తారు? మోడీ వ్యతిరేక జట్టుతో కలిసే ధైర్యం చేస్తారా? లేక మా రాష్ట్రం మా రాజకీయం అని ఏపీకే పరిమితం అవుతారా? లెట్స్ వాచ్! 2019 ఎన్నికల టైమ్‌లో మోడీకి వ్యతిరేకంగా ఉద్యమంటీడీపీ జాతీయ రాజకీయాలపై…
మాది కూడా ఒక పార్టీ అన్నట్టుగా ఉన్నారు ఆ శిబిరంలోని నాయకులు. పెద్దగా ప్రజల్లోకి వెళ్లిందీ లేదు. ఇంతలో పార్టీ అధ్యక్షుడే గోడ దూకేందుకు సిద్ధమయ్యారు. చెక్‌పోస్టు పడకుండానే లోడ్ ఎత్తేయడానికి రెడీగా ఉన్నారు. మరి.. ఆయన స్థానంలో వచ్చేవారు ఎవరు? ఆ దిశగా కసరత్తు మొదలైందా లేదా? తెలంగాణలో టీడీపీ బలంగా నిలబడే అవకాశం చిక్కలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ వెలుగు వెలిగిన పార్టీ తెలుగుదేశం. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ పరిస్థితి నానాటికీ…
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కుటుంబం పెద్ద ఎత్తున భూముల ఆక్రమణలకు పాల్పడింది అని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఏమ్మెల్యే గా ఉండి ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున దోచుకున్నారు. పల్లా కుటుంబం కబ్జాలు నిర్ధారించుకున్న తర్వాతే వాటిని స్వాధీనం చేసుకుంటున్నాంచంద్రబాబు పెద్ద భూకుంభకోణానికి నాంది పలికాడు. వారి బాటలోనే పల్లా శ్రీనివాస్ ఆక్రమణలకు పాల్పడ్డారు. మా ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచింది. మా హయాంలో మా నాయకులు ఎవ్వరు భూకబ్జా లకు పాల్పడలేదు.…
మా కంపెనీపై అసత్య ప్రచారాలు చేసినందుకు మాజీ మంత్రి సోమిరెడ్డిపై ఫిర్యాదు నమోదయ్యింది. శేశ్రిత టెక్నాలజీ ఎండి నర్మద్ రెడ్డి మాట్లాడుతూ… కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్ లో సోమిరెడ్డి పై కంప్లయింట్ చేశాను. మా కంపెనీ డేటా దొంగలించాడు. మేము వైకాపా అభిమానులమే. జగన్,వైఎస్ అభిమానులు అయితే మంచి చేయకూడదా అని ప్రశ్నించిన ఆయన సోమిరెడ్డి ఆరోణపలు అవాస్తవం అని తెలిపారు. నకిలీ వెబ్ సైట్ ద్వారా కోట్ల దోచుకోవాలని కాకాని చూస్తున్నాడన్న మాజి మంత్రి…