Atchannaidu: నేనేం తప్పు చేశాను.. నన్నెందుకు జైల్లో పెట్టారు..? అంటూ టీడీపీ-జనసేన జయహో బీసీ వేదికగా నిలదీశారు టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు.. నేను అవినీతి చేశానని నిరూపిస్తే తల తీసేసుకోవడానికి కూడా సిద్ధం అని ప్రకటించారు.. మంగళగిరిలో జరిగిన టీడీపీ-జనసేన జయహో బీసీ సభలో మాట్లాడిన అచ్చెన్నాయుడు.. పల్లకీలు మోసే బీసీలను ఎన్టీఆర్ పల్లకీలు ఎక్కించారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ వల్లే బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్ధిక లబ్ధి చేకూరింది.. ఎన్ని కష్టాలు వచ్చినా బీసీలు టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నాయన్నారు.. బీసీలు టీడీపీకి అండగా ఉంటారని.. సీఎం వైఎస్ జగన్ బీసీలను అణిచేస్తున్నారని ఆరోపించారు. బీసీలు గెలవాలంటే టీడీపీ – జనసేన గెలవాలి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు..
Read Also: Rishabh Pant: గల్లీలో పిల్లలతో కలిసి గోళీలు ఆడుతున్న స్టార్ క్రికెటర్.. వీడియో వైరల్
ఇక, జగన్ చేసింది తప్పంటే.. జైల్లో పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు.. బీసీలకు గళమెత్తే అర్హత లేదా..? అని నిలదీశారు. ఐదేళ్లల్లో బీసీలకు ఒక్క మేలైనా జరిగిందా..? జగన్ పెట్టిన కార్పేరేషన్లు నాలిక గీసుకోవడానికి కూడా పనికి రావు అంటూ విమర్శలు గుప్పించారు. ఆదరణ పరికరాలు తుప్పు పట్టేలా చేస్తున్నారు.. కానీ, బీసీలకు మాత్రం ఆ పరికరాలు ఇవ్వడం లేదు అని ఆరోపించారు టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు.