విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి, జనసేన నేత కొణతాల రామకృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఆశించిన ఫలితం రాబోతుంది.. పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీనీ కలపడంతో జనసేన సఫలీ కృతమైంది.
గౌరు చరిత రెడ్డి ప్రజలను ఓటు అభ్యర్థిస్తూ.. పాణ్యం నియోజకవర్గ ఓటర్లకు ఓ హామీ పత్రాన్ని విడుదల చేశారు. తనకు ఈసారి అవకాశం ఇస్తే.. ఓర్వకల్లు కేంద్రంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా కలిగిరి మండలంలోని దూబగుంట, కృష్ణారెడ్డి పాలెం గ్రామాల్లో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తెనాలిలోని రాధాకృష్ణ కళ్యాణ మండపంలో గురువారం నాడు జయహో బీసీ కార్యక్రమం జరిగింది. తెనాలి నియోజకవర్గ నాయకులతో పాటు గ్రామ మండల స్థాయి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో కలిగిరి ఎంపీపీ, ఎంపీటీసీలు సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డ్ నెంబర్లు, ముఖ్య నాయకులు సుమారు 1000 మందికి పైగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు.
తాడికొండ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కొర్రపాడు, విశదల, మందపాడు, సిరిపురం, వరగాని గ్రామాల్లో పర్యటించారు.