నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి, నారా లోకేష్ సమక్షంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం నాడు ఆయన అనుచర వర్గంతో కలిగిరి మండలం అనంతపురం గ్రామం నుంచి సుమారు 3000 బైకులతో ర్యాలీగా వచ్చి టీడీపీలో చేరారు. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో కలిగిరి ఎంపీపీ, ఎంపీటీసీలు సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డ్ నెంబర్లు, ముఖ్య నాయకులు సుమారు 1000 మందికి పైగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వారందరికీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కంభం విజయరామిరెడ్డిలు కండువాలు కప్పి సాధారంగా పార్టీలోనికి ఆహ్వానించారు.
Read Also: CM Revanth Reddy: నేడు జగిత్యాలలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన..
ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాం.. ఆశీర్వదిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకుంటే పరిశ్రమలు వస్తాయి.. ఉపాధి దొరుకుతుంది, రాజధాని నిర్మాణం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయన్నారు. అలాగే, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది.. బాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాకర్ల సురేష్ కోరారు. ఇక, ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలను ప్రగతి పథంలో నడిపిస్తామని నియోజకవర్గంలో వెనుకబడిన సీతారామపురం మండలాన్ని అగ్రగామిగా నిలుపుతామని నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ లు పేర్కొన్నారు.