Pawan Kalyan: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన పార్టీ విజయం సాధించింది. గెలుపే లక్ష్యంగా టీడీపీ- జనసేన- బీజేపీ కూటమిగా జత కట్టాయి. అయితే, ఈ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు రేపు (జూన్ 12వ) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వంలో ఎవరికి ఏ ఏ మంత్రి పదవులు దక్కుతాయనే ఉత్కంఠ కూటమి నేతల్లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలందరూ పవన్ కళ్యాణ్ ను శాసన సభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు.
Read Also: Uttarpradesh : విడాకులు తీసుకున్న 12 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు
ఇక, కొత్తగా ఏర్పాడబోయే ప్రభుత్వంలో జనసేన పార్టీకి 4 మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తో పాటు సోషల్ మీడియాలో మరో రెండు పేర్లు బాగా ప్రచారం అవుతున్నాయి. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్‌లకు మంత్రులుగా ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంటున్నారు. అయితే వీరిద్దరికి రాజకీయ అనుభవం కూడా ఉండటంతో ఈ అంశాలను కూడా పవన్ కళ్యాణ్ పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.