పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా కలిగిరి మండలంలోని దూబగుంట, కృష్ణారెడ్డి పాలెం గ్రామాల్లో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక, వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో వాల్మీకి వంశస్థుల ఆత్మీయ సమావేశంలో కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహర్షి వాల్మీ రచించిన రామాయణం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అంతటి ఘన కీర్తి కలిగిన వాల్మీకి వంశస్థులు ఉదయగిరి చరిత్రను తిరగరాయాలన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే వాల్మీకుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే, ప్రతి గ్రామంలోని 50 గడపలకు ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కాకర్ల సురేష్ హామీ ఇచ్చారు. కాబట్టి మే 13న జరిగే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెకి, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ అనే నాకు సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీ అందించాలని కోరారు.
Read Also: Vladimir Putin : వణుకు పుట్టిస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యలు
అలాగే, ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండలం ముస్తాపురం గ్రామంలో ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మరదలు కాకర్ల సురేఖ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి టీడిపి ఎన్నికల మ్యానిఫెస్టో కర పత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తూ.. మా బావ కాకర్ల సురేష్ పోటీ చేస్తున్నా.. సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. మరోవైపు, కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ ఇంటింటికి తిరిగి మహిళలకు బొట్టు పెట్టీ నా భర్త కాకర్ల సురేష్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడిపి జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Read Also: Actor Bramhaji :ఛీ ఛీ… బూతు పురాణాలు.. వాంతులయ్యేలా ఉన్నాయి..
ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ కి మద్దతుగా డ్యాన్స్ మాస్టర్, జనసేన ప్రచార కార్యదర్శి జానీ మాస్టర్ మాట్లాడుతూ.. సంపద సృష్టించే మొనగాడు చంద్రబాబు నాయుడు అన్నారు. అలాగే, రాజధాని నిర్మాణం జరగాలన్న, పోలవరం పూర్తి కావాలన్నా, రోడ్లు బాగుపడాలన్న, యువతకు ఉద్యోగాలు రావాలన్నా, సంక్షేమ అభివృద్ధి పరిగెత్తాలన్నా, డబుల్ ఇంజన్ సర్కార్ అని ఆయన పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్ 4000 అవుతుందన్నారు.. అలాగే, సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందని జానీ మాస్టర్ తెలిపారు. కాబట్టి మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజా సేవకులైన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.