Tarun Chugh Comments On TRS: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీజేపీ పెద్ద ఎత్తున ఇతర పార్టీ నేతలను చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరోవైపు ఇది జరిగిన రోజు వ్యవధిలోనే దాసోజు శ్రవణ్ కూడా కాంగ్రెస్ పార్టీని వీడారు. దీంతో వరసగా కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…
‘కశ్మీర్ ఫైల్స్’ మూవీ వచ్చిన దగ్గర నుండి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్… హైదరాబాద్ స్వాతంత్రోద్యమంతో ముడిపడిన రజాకార్ల ఆగడాలు సైతం వెండితెరపైకి ఎక్కాలని భావిస్తున్నారు. ‘కశ్మీర్ ఫైల్స్’ మూవీని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఇప్పుడు ‘ఢిల్లీ ఫైల్స్’ పేరుతో ఇందిరాగాంధీ మరణానంతరం జరిగిన శిక్కుల ఉచకోత మీద మరో సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇదిలా ఉంటే… తాజాగా కేంద్ర…
బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ చేసి వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయిందని.. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రారని..వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని తరుణ్ చుగ్ కామెంట్లు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగారు. కౌంట్ డౌన్ ప్రారంభం అయింది టీఆర్ఎస్ కు కాదని.. బీజేపీకి అని విమర్శించారు.…
టీఆర్ఎస్ పార్టీకి కౌంట్ డౌన్ మొదలైందని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ రచ్చ మొదలైంది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు బీజేపీ పార్టీ, ప్రధాని మోదీతో పాటు తరుణ్ చుగ్ పై విరుచుకుపడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకనంద బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పించారు. పంజాబ్ లో ప్రజల…