కేసీఆర్ పగటి కలలు కంటున్నాడు అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మాండ రాష్ట్ర సమితి పెట్టుకున్న అద్భుతాలు ఏమి జరగవని, కేసీఆర్ చేతుల నుండి అధికారం జారీ పోతుందని, తాంత్రికుడు సూచన మేరకే పార్టీ పేరు మార్చాడని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర త్రెడ్మిల్ మీద రన్నింగ్ చేస్తున్నట్టే… అయన ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటాడని విమర్శించారు. కాంగ్రెస్ కాలం చెల్లిన ఇంజెక్షన్ లాంటిదని, ఆ పార్టీ వెంటిలేటర్ మీద ఉందని, 80 ఏళ్ల వృద్దుడు అయిన మల్లికార్జున్ ఖర్గే ని బలి పశువును చేస్తున్నారని ఆయన అన్నారు. మునుగోడులో భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్‌కు ప్రజలు దూరం అయ్యారని, ప్రజా ధనాన్ని లూటీ చేశారని ఆయన ఆరోపించారు. బంగారు తెలంగాణ కలలను కల్లలు చేశాడని, తెలంగాణలో కేసీఆర్ ఫెయిల్ అయ్యాడని ఆయన అన్నారు. కేటీఆర్ మోడీ గురించి పాకిస్తాన్ ను అడిగితే చెబుతుంది… ఇమ్రాన్ ఖాన్ అడుగు చెబుతాడు… మద్యం కల్చర్, అవినీతి నుండి తెలంగాణ ప్రజలు విముక్తి కోరుకుంటున్నారు. రాజ్ గోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ ల కోసం కాదు… ఇష్టంతో బీజేపీ లో చేరారు… బంగారు తెలంగాణ కోసం.. కేసీఆర్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా బీజేపీలో చేరారని ఆయన స్పష్టం చేశారు.