హిందూ సమాజం సంఘటితం కావాల్సిన అవసరం వుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్. బడా గణపతికి ప్రత్యేక పూజలు చేశారు బండి సంజయ్.. తరుణ్ చుగ్.. గణపతికి 21కిలోల లడ్డూని సమర్పించారు బీజేపీ మాజీ ఎమ్యెల్యే , రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో బడా గణేష్ ని దర్శించుకోవాలని తరుణ్ చుగ్ అన్నారు.. అందుకే వచ్చాం అన్నారు బండి సంజయ్.
Read Also: Tornado Scene in Manjeera:మంజీరా నదిలో టోర్నెడో సీన్.. వావ్ అంటున్న జనం
హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలనీ ఒక్క అడుగుతో ప్రారంభమై 68ఏళ్లకు చేరుకుంది.. శంకరయ్య అడుగుజాడల్లో కుటుంబ సభ్యులు బడా గణపతిని ముందుకు నడిపిస్తున్నారు. బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి ఐక్యతను తేవడానికి బాలగంగాధర తిలక్ వినాయక నవరాత్రులను ప్రారంభించారన్నారు. హిందూ సమాజాన్ని ఏక తాటిపైకి తేవడానికి వినాయక నవరాత్రులు జరుపుకుంటున్నాం.. విఘ్నాలను తొలగించే వినాయకుడిని ఎల్లవేళలా కొలవాలన్నారు. హిందూ సమాజం చీలిపోతే తెలంగాణకే ప్రమాదం అని హెచ్చరించారు బండి సంజయ్.
హిందూ బంధువులు అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. హిందూ సమాజం అంతా సంఘటితం కావాలి.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అందరూ పరిశీలించాలన్నారు. అందరూ సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నానన్నారు బండి సంజయ్.
Read Also: Special Story on Teacher’s Day: ఎందరో టీచర్లు.. అందరికీ వందనాలు..