ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్‌లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను ఆమె డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు.
నల్లజర్ల మండలంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడిని ఖండిస్తూ ద్వారకాతిరుమలలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. ఈ నిరసన కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య కొట్లాట జరిగింది. మంత్రి తానేటి వనిత ప్రచారంలో వివాదం చెలరేగింది. నల్లజర్లలో ముళ్లపూడి బాపిరాజు ఇంటి వద్ద బైక్ సైలెన్సర్లతో హంగామా సృష్టించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల తనపై ప్రతిపక్ష నాయకురాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన ఆరోపణలపై హోమ్ మినిస్టర్ తానేటి వనిత స్పందించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇప్పుడు చంద్రబాబు అమలు చేస్తానంటున్నారని మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. నాకు అనుభవం ఉందని చెప్పుకోవడమే తప్ప పేదల పక్షాన ఇది చేస్తానని చెప్పే సత్తా చంద్రబాబుకు లేదన్నారు. శవరాజకీయాలు చేసింది టిడిపి మంత్రులే అని ఆమె ధ్వజమెత్తారు. పుష్కరా
నియోజకవర్గ మార్పుపై రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత కన్నీటిపర్యంతం అయ్యారు. కొవ్వూరు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రిని గోపాలపురం వైసీపీ ఇంఛార్జిగా నియమించారు. ఈ సందర్భంగా కొవ్వూరులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత కన్నీళ్లు పెట్టుకున్నారు.
రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని, ఇందుకు రైతుల పక్షాన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన వ్యక్తం చేస్తున్నామని అని బిసి సంక్షేమ, సమాచ�