Home Minister Taneti Vanitha: నియోజకవర్గ మార్పుపై రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత కన్నీటిపర్యంతం అయ్యారు. కొవ్వూరు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రిని గోపాలపురం వైసీపీ ఇంఛార్జిగా నియమించారు. ఈ సందర్భంగా కొవ్వూరులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత కన్నీళ్లు పెట్టుకున్నారు. కొవ్వూరు నియోజకవర్గం వదిలి వెళ్లటం ఎంతో బాధగా ఉందని కార్యకర్తలు ముందు బాధను వ్యక్తం చేశారు .
Read Also: Janga Krishnamurthy: వైసీపీ పార్టీని వీడే ఆలోచనలో ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి!
హోంమంత్రిని నియోజకవర్గ మార్చడంపై కొవ్వూరు నియోజవర్గ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు, కొందరు నాయకులు తమ పదవులకు రాజీనామా పత్రాలను హోంమంత్రికి అందజేయగా వీరికి నచ్చజెప్పి రాజీనామాలను నిలుపుదల చేశారు. కొవ్వూరు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జిగా నియమించిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును నియోజకవర్గ నాయకులు అందరూ ఆదరించి గెలుపుకు తోడ్పడాలని హోంమంత్రి తానేటి వనిత కోరారు.