Off The Record: వైసీపీ పవర్‌లో ఉన్నప్పుడు అత్యున్నత పదవికట్టబెట్టినా… ఇప్పుడా లీడర్ పార్టీ కోసం పని చేస్తోంది అంతంతమాత్రమేనా? తన స్వార్ధం కోసం నియోజకవర్గంలో పార్టీని ముక్కలు చెక్కలు చేస్తున్నారా? ఒక చోట గ్రూపుల గోలను భరించలేక మరో చోటికి పంపితే… అక్కడ అంతకు మించి అన్నట్టుగా చేస్తున్న ఆ నాయకురాలు ఎవరు? అసలామె బాధేంటి?
Read Also: Pakistan: ‘‘భారత్ మాపై దాడి చేస్తే, ప్రపంచం అంతం’’.. పాక్ రక్షణ మంత్రి వార్నింగ్..
గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడి నుంచి 2009 ఎన్నికల్లో టిడిపి తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన తానేటి వనిత తర్వాతి కాలంలో వైసిపిలో చేరి కొవ్వూరుకు షిఫ్టయ్యారు. 2019ఎన్నికల్లో వైసీపీ వేవ్‌లో గెలిచి కీలకమైన రాష్ట్ర హోం మంత్రి అయ్యారామె. పదవిలో ఉన్నంత కాలం పెద్దగా ప్రభావం చూపలేకపోయిన వనిత…. నియోజకవర్గ గ్రూపు తగాదాల్లో మాత్రం కీరోల్ ప్లే చేశారన్న విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఉంటే ఆమె అయినా ఉండాలి లేదా మేమైనా ఉండాలంటూ కార్యకర్తల నుంచి నాయకుల వరకు అంతా అనడంతో… ఆ దెబ్బకు వనితను కొవ్వూరు నుంచి గోపాలపురం షిప్ట్ చేశారు. కానీ… ఊరు మారినా… ఆమె తీరు మాత్రం మారలేదన్న టాక్ నడుస్తోంది. వనిత దెబ్బకు ఇపుడు గోపాలపురం వైసిపి డజను గ్రూపులుగా చీలిపోయినట్టు చెప్పుకుంటున్నారు. కొవ్వూరులో ఎలాగూ అవకాశం లేదు.. కనీసం గోపాలపురంలో అయినా తన సీటును కాపాడుకోవాలన్న ఉద్దేశ్యంతో మాజీ హోం మంత్రి తన వర్గానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ గతంలో ఉన్న నాయకులను పక్కనపెట్టేస్తున్నారట.
Read Also: Off The Record: జగన్ విషయంలో సైలెంట్ ఎందుకు..?
అయితే, 2019 ఎన్నికల్లో గోపాలపురం ఎమ్మెల్యేగా పని చేసిన తలారి వెంకట్రావుకు తిరిగి ఆ సీటు ఎక్కడ ఇచ్చేస్తారోనన్న భయంతోనే ఆమె గ్రూపుల్ని పోషిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు స్థానికంగా. పైగా ఇప్పటికీ తాను హోం మంత్రినే అన్న భ్రమలో ఉన్నారని, అదే తరహా గౌరవ మర్యాదలు కోరుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ నాయకుల మీద కేసులు పెడుతున్నా…. ఆమె మాత్రం నోరు మెదపడంలేదంటున్నారు. ఎందుకలాగని అంటే… మీరు మరీనూ…. సాక్షాత్తు, పార్టీ అధ్యక్షుడి మీద రాయి దాడి జరిగినప్పుడు హోం మంత్రిగా ఉండి కూడా ఆమె స్పందించలేదు. ఇక ఇప్పుడు స్పందనలు ఆశిస్తున్నారా అంటూ వెటకారాలాడుతున్నారట కొందరు నాయకులు. గోపాలపురం ఇన్ఛార్జ్ అయినా.. ఆమె తాడేపల్లిగూడెంలో నివాసం ఉండటంతో మేడమ్‌ని కలవాలన్నా, పార్టీ కార్యక్రమాలకు పిలవాలన్నా కొత్త తలనొప్పులు ఎదురవతున్నాయట. ఒకవేళ ఇంటికెళ్ళి కుర్చున్నా రెండు మూడు గంటలు ఎదురుచూస్తేగానీ… అమ్మగారి దర్శనం అవదన్నది నియోజకవర్గ నాయకుల మాట. ఇటీవల విగ్రహాల వివాదంలో ఇరుక్కున్న వైసిపి కార్యకర్త విషయంలో ప్రెస్ మీట్ పెట్టి ఖండించాలని అంతా కోరినా ఆమె మాత్రం నాది ఆ స్థాయి కాదని సమాధానం ఇచ్చారట.
Read Also: Off The Record: మాజీ మంత్రి అనిత్ కుమార్ యాదవ్ వంతు వచ్చిందా..?
ఇక, నియోజకవర్గంలో శుభ కార్యాలకు ఎలా అటెండ్ అవుతున్నారో.. అలాగే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించమంటే డోంట్‌కేర్ అన్నట్టుగా ఉంటున్నారట వనిత. ఈ మాజీ హోం మంత్రి తీరుతో కొందరు నాయకులు సైలెంట్ అవుతుంటే.. అవకాశం వచ్చిన వాళ్ళు మాత్రం పక్కపార్టీలోకి జంప్ అవుతున్నట్టు సమాచారం. ఇటీలవ జరిగిన గోపాలపురం నియోజకవర్గ సమావేశంలో చెల్లుబోయిన వేణు, జక్కంపూడిరాజా వంటి నాయకులు హాజరైనప్పుడు కొంత మంది మహిళా నేతలు ఓపెనైపోయారట. మీరు వచ్చారు కాబట్టి ఈ జనమైనా ఉన్నారు. లేదంటే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పుకొచ్చారట. ఇతర నియోజకవర్గాల్లో కార్యకర్తలను పట్టించుకుంటున్నట్టు తమ నియోజకవర్గంలో పరిస్థితి ఎప్పుడు మారుతుందోనంటూ వనిత ముందే సెటైర్స్ వేసినట్టు సమాచారం. గతంలో గోపాలపురం ఎమ్మెల్యేగా పని చేసిన తలారి అనుచరులందరిని ఒక గ్రూపుగా చూస్తున్న మాజీ హోం మంత్రి.. తనుకు అనుకూలంగా ఉండేవారిని మరోగ్రూపుగా తయారు చేసుకున్నట్టు సమాచారం.
Read Also: Rajinikanth : రజినీకాంత్ ’కూలీ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ నెలలోనే..
కాగా, దీంతో ఇదెక్కడి గ్రూపుల గోలరా.. బాబూ… అనుకుంటూ తలలు పట్టుకుంటున్నారట కార్యకర్తలు. ఇలాంటి సామాజిక లెక్కలతో కొవ్వూరులో ముక్కలు చేశారు… ఇప్పుడు గోపాలపురంలో కూడా అలాగే చేస్తారా అంటూ నిరసనలు వ్యక్తం అవుతున్నాయట. నాలుగు మండలాల్లో ఒక్క కాపు నేతకు కూడా గుర్తింపు ఇవ్వకపోవడంతో వారంతా చివరిసారిగా పార్టీ పెద్దలను కలసి గోడు చెప్పుకుందామని, పరిస్థితి మారకుంటే జనసేనకైనా వెళ్థామని చర్చించుకుంటున్నారట. ఇలా…. పరిస్థితి చూస్తుంటే…తానేటి వనితకు మరోసారి ట్రాన్స్‌ఫర్ తప్పదేమోనన్న టాక్ మొదలైంది నియోజకవర్గంలో. మాజీ ఎమ్మెల్యే తలారి తిరిగి రాకుండా ఉండాలంటే ఆయన వర్గానికి ఎక్కడా ప్రాధాన్యత లేకుండా చేస్తే సరిపోతుందనేది మాజీ మంత్రి ఎత్తుగడ కాగా… ఆ వైఖరితో మొదటికే మోసం వస్తుందన్నది కేడర్ గోడు.