Taneti Vanitha: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన మహేంద్ర ఆత్మహత్య ఘటనపై సీఐడీ విచారణకు ఆదేశించనున్నట్లు హోం మంత్రి తానేటి వనిత వెల్లడించారు. ఈ ఘటనక తనకు ఎటువంటి సంబంధం లేదని, కావాలనే తన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మహేంద్ర ఆసుపత్రిలో జాయిన్ అయిన దగ్గర్నుంచి వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించాలని డాక్టర్లకి సూచించానని అన్నారు.
Also Read: Vijayasai Reddy: పచ్చ పార్టీకి కాపలా కాయడం ఆమెకు మాత్రమే సాధ్యం
కొవ్వూరులో హోంమంత్రి తానేటి వనిత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి సీఐడీ ఎంక్వయిరీ వేయమని కోరినట్లు తెలిపారు. సీఐడీ ఎంక్వయిరీకి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ ఎంక్వైరీలో మహేంద్ర మృతి వెనక నిజ నిజాలు నిగ్గు తేలతాయని అన్నారు. జనసేన పార్టీకి చెందిన నాయకులు దురుద్దేశంతో ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు.