ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇప్పుడు చంద్రబాబు అమలు చేస్తానంటున్నారని మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. నాకు అనుభవం ఉందని చెప్పుకోవడమే తప్ప పేదల పక్షాన ఇది చేస్తానని చెప్పే సత్తా చంద్రబాబుకు లేదన్నారు. శవరాజకీయాలు చేసింది టిడిపి మంత్రులే అని ఆమె ధ్వజమెత్తారు. పుష్కరాల సమయంలో భక్తులకు ఏర్పాట్లు చేయకుండా షూటింగ్ ల పేరుతో 32 మంది అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని, వృద్ధులకు పెన్షన్లు అందకూడదని టిడిపి నాయకులు చేత ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు చేయించారన్నారు.
వృద్ధుల ఉసురు టీడీపీకి తగలకుండా పోదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దాహంతో ఏదో ప్రతిదీ రాజకీయం చేస్తున్నారని, ఎవరిని నమ్మితే పేదల కుటుంబాలు మెరుగవుతాయో ప్రజలకు తెలుసు అన్నారు తానేటి వనిత. విజన్ విజన్ అని చంద్రబాబు అంటున్నారు. విజన్ గురించి మాట్లాడకుండానే పేదలు చదువు గురించి వెనుకబడిన వర్గాల సంక్షేమం గురించి అమలు చేసి సీఎం చూపిస్తున్నారన్నారు.
మహిళలను రవాణా చేస్తున్నారని, పింఛన్ల పంపిణీతో ప్రలోభాలకు గురి చేస్తారని, డేటా చోరీ చేసి అమ్మేస్తున్నారని తప్పుడు ప్రచారం చేశారని, ఇప్పుడు టెర్రరిస్టులంటూ మరింత దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ఆరోపణలను మంత్రి ఖండించారు. ప్రజలకు పింఛన్లు సకాలంలో అందకుండా అడ్డం పడిన తీరు చాలా బాధాకరంగా ఉందని అన్నారు. టీడీపీ నాయకుడిగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యాన వలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకున్నారని తెలిపారు. దీనివలన లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవలసిన దుస్థితి ఏర్పడిందని ఆమె అన్నారు. పింఛన్లు ఎప్పుడు, ఎలా అందుతాయో తెలియక పేదలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.