తూర్పుగోదావరి జిల్లాలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది… హోంశాఖ మంత్రి తానేటి వనితకు తన సొంత ఇలాకాలో చేదు అనుభవం ఎదురైంది… ఆమె సొంత నియోజకవర్గం కొవ్వూరులో అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరింది… అసలు వైసీపీ అభ్యర్థులు పోటీలో కనిపించకుండా పోవడం చర్చగా మారింది.. మొత్తంగా.. 11 డైరక్టర్ స్థానాలు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు టీడీపీ అభ్యర్థులు… ఆ పార్టీ నేత మద్దిపట్ల శివరామకృష్ణను చైర్మన్‌గా ఎన్నుకున్నారు డైరెక్టర్లు.. దీంతో,…
పడవ ప్రమాద ఘటనను టీడీపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు హోంమంత్రి తానేటి వనతి.. తెలుగుదేశం పార్టీ నేతలు అడిగితే ఈ ఘటనపై విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉన్నాం అన్నారు.
వైసీపీ మంత్రులు, నేతలు ప్రారంభించిన సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర రాజమండ్రి చేరుకుంది. అనంతరం జరిగిన బహిరంగసభకు హాజరయ్యారు మంత్రి విశ్వరూప్. నిన్నటి నుంచి యాత్రకు హాజరు కాలేదు విశ్వరూప్. అమలాపురం ఘటన తర్వాత అసంతృప్తితో ఉన్నారు మంత్రి విశ్వరూప్. బహిరంగసభలో మంత్రి విశ్వరూప్ మాట్లాడారు. సభా సమయం ఆలస్యం కావటంతో కొంత మంది మహిళలు వెనక్కి వెళ్ళి పోయారు. అనివార్య కారణాల వల్ల నేను బస్సు యాత్రలో పాల్గొన లేక పోతున్నా అన్నారు విశ్వరూప్.…
ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇరిగేషన్, అగ్రికల్చర్‌పై రివ్యూ మీటింగ్ నిర్వహించగా ఈ సమావేశానికి మంత్రి తానేటి వనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జిల్లా ఏర్పడిన తర్వాత ఇదే మొదటి సమావేశమని తెలిపారు. ఈ మీటింగ్‌లో వచ్చిన సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. అందరి సహకారంతో జిల్లాను ముందుండి నడిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పాత కృష్ణా జిల్లాకు మంచి పేరు ఉందని.. ఇప్పుడు అదే రీతిలో ఎన్టీఆర్ జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని…