దేశ రాజధాని ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో జరిగిన సమావేశంలో ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఆగస్టు నెలలో కెనడాలో జరిగే అంతర్జాతీయ స్పీకర్ల సదస్సుకు సంబంధించి శుక్రవారం నాడు లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అసెంబ్లీ స్పీకర్లు, మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. సభ్యుల ప్రవర్తనపై ఎప్పుడూ ఉండే విధానం ఉంటుందని.. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం…
శ్రీకాకుళం జిల్లా నుంచి రాజకీయ యాత్రలు ప్రారంభిస్తే తిరుగే ఉండదని భావిస్తాయి పొలిటికల్ పార్టీలు. తాజాగా వైసీపీ తమ మంత్రులతో చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర కూడా అదేకోవలోకి వస్తుంది. పైగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 90 శాతం మంది బడుగు బలహీన వర్గాల వారే. అధికారపార్టీ కూడా ఈ యాత్రను ప్రతిష్టాత్మకంగా భావించడంతో.. అంతే అట్టహాసంగా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయంలో సిక్కోలు వైసీపీ నేతలు బాధ్యతలు తీసుకుంటారని లెక్కలేసుకున్నాయి పార్టీ వర్గాలు. అంతర్గత…
ఏపీలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. అందునా శ్రీకాకుళం జిల్లాలో బంధువుల మధ్యే రాజకీయ వైరం ముదురుతోంది. టీడీపీ నేత కూనరవి- స్పీకర్ తమ్మినేని మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. టీడీపీపై స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కూన రవి. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే రకం తమ్మినేని. తమ్మినేనిని ఆముదాల వలసలో సజీవంగా దహనం చేస్తారు. తమ్మినేని పాడె మోయడానికి కూడా ఎవరు ఉండరని ఘాటైన…
ఏపీ మంత్రులు తలపెట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. విశాఖ పాత గాజువాక వైఎస్ఆర్ విగ్రహం నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారాం అమలాపురం అల్లర్లపై స్పందించారు. ఏపీలో ప్రతిపక్షాలు కావాలనే అల్లర్లు సృష్టిస్తున్నాయని స్పీకర్ తమ్మినేని ఆరోపించారు. టీడీపీ వాళ్లు చేసేది మహానాడు కాదు వల్లకాడు అని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డారు. చచ్చిన పార్టీకి ప్రజలు దహన సంస్కారాలు…
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి టీడీపీ మీద మండిపడ్డారు. టీడీపీ సహా ఇతర పార్టీలన్నీ ఫిలాసఫీ లేని పార్టీలని.. పాలసీ, విధానం లేకుండా పొత్తులు పెట్టుకుంటే పొట్టలో కత్తులు పెట్టుకున్నట్టేనని ఆయన అన్నారు. సీఎం జగన్ మాత్రం పొలిటికల్ ఫిలాసఫీతో ఉన్నారని, అందుకే సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. పిల్లల విద్య కోసం నాడు-నేడు, విద్యా దీవెన, అమ్మ ఒడి వంటివి అనేక కార్యక్రమాల్ని రూపొందించారని తెలిపారు. గతంలో…
ప్రకాశం జిల్లాలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంత్రివర్గ విస్తరణపై స్పందించారు. కొత్త మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనేది సీఎం జగన్‌కు ఉన్న విశేష అధికారం అని.. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీ నేతలు శిరసావహిస్తారని స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల మధ్య విభేదాలు ఉన్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తోందని.. అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే వైసీపీని గెలిపిస్తారని ధీమా…
పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. పెగాసెస్ వ్యవహారంపై చేసిన కామెంట్లు ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పుట్టించాయి.. ఇప్పటికే ఈ వ్యవహారంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. అయితే, ఏపీ అసెంబ్లీలోనూ పెగాసెస్ ప్రస్తావన వచ్చింది… చంద్రబాబు పెగాసెస్ స్పై వేర్‌ను వినియోగించారన్న మమతా బెనర్జీ కామెంట్లపై చర్చకు సిద్ధమైంది అధికార వైసీపీ.. అయితే, పెగాసెస్ పై చర్చకు నోటీసివ్వాలన్న స్పీకర్ తమ్మినేని సూచించగా… ఇప్పటికే నోటీసు ఇచ్చినట్టు చీఫ్ విప్…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై ప్రతిపక్షాలు పలు విమర్శలు చేస్తూ వస్తున్నాయి.. స్పీకర్ స్థానంలో ఉన్న ఆయన పొలిటికల్ కామెంట్లు చేయడం ఏంటి? విమర్శలు చేయడం ఎందుకు? స్పీకర్‌గా ఉండి ఇలా చేయొచ్చా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే, తనను విమర్శిస్తున్న వారికి కౌంటర్ ఇచ్చారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. స్పీకర్ మాట్లాడటమేంటి అంటున్నారు.. ప్రజలు ఓటేసి నన్ను గెలిపించారు.. వారి కోసం మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి చెప్పడం కూడా…