చంద్రబాబుపై స్పీకర్ తమ్మినేని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఈ జన్మకి జైల్లోంచి బయటకి రారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకు, నాయకులకు బాధగా ఉండవచ్చు అన్నారు. బాబు 13 చోట్ల సంతకాలు చేసారని.. స్కిల్ స్కాం రెడ్ హ్యాండెడ్ క్రైం అని తెలిపారు. చంద్రబాబు మెదటి నుంచి స్కాంల వ్యక్తేనని సీతారాం దుయ్యబట్టారు.
చంద్రబాబు అరెస్ట్ పై స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే విచారణ సంస్థలు గుడ్డిగా వెళ్ళిపోవని స్పీకర్ అన్నారు. చట్టంకి ఎవరూ చుట్టం కాదని తెలిపారు.
Off The Record: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం . శాసనసభాపతిగా ఉంటూనే ఫక్తు రాజకీయ విమర్శలు చేయడం ఆయన స్టైల్. అధికారులను మందలించడం, ప్రతిపక్షం మీద విరుచుకుపడటం లాంటి విషయాల్లో ఎక్కడా తగ్గరు తమ్మినేని. కానీ…అదంతా పైపై హంగామాయేనా అన్న అనుమానాలు ఇప్పుడు నియోజకవర్గంలో పెరుగుతున్నాయట. అక్రమ మైనింగ్ విషయంలో ఎందుకంత ఉదాసీనంగా ఉంటున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. పొందూరు, కృష్ణాపురం పరిసరాల్లో ప్రతిపక్ష టీడీపీ నేతలు…
Tammineni Sitaram: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మార్కెట్ యార్డులో పెన్షన్‌లు పంపిణీ చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య జరిగేవి కాదని.. పేదవాడికి, పెత్తందార్లకు మధ్య జరిగే ఎన్నికలు అని వ్యాఖ్యానించారు. పెన్షన్‌లు తొలగించామని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని.. కానీ తాము పెన్షన్ పెంచి ఇస్తున్న సంగతి గుర్తించాలని హితవు పలికారు. టీడీపీ హయాంలో రాష్ట్రాన్ని లూటీ…
Tammineni Sitaram: ఏపీలో మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక కామెంట్లు చేశారు. రాజధాని వికేంద్రీకరణపై స్పష్టమైన తీర్పు వచ్చిందని.. న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతున్న తరుణంలో ఈ తీర్పు మళ్లీ న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగేలా చేసిందని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. హైకోర్టును మీరు ప్రభుత్వమా.. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లా అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం గమనించాల్సిన విషయం అని పేర్కొన్నారు. భారతీయ రాజ్యాంగం చాలా గొప్పదని.. శాసన, న్యాయ, కార్యనిర్వాహక…
తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు చేస్తున్నది అసమర్థుడి అంతిమ యాత్ర అంటూ ఎద్దేవా చేశారు.. టీడీపీ అంపశయ్యమీద ఉంది.. వెంటిలేటర్ తీసేయడమే మిగిలిందంటూ వ్యాఖ్యానించారు.. ఎన్టీ రామారావును వైకుంఠానికి పంపిన చంద్రబాబుకు ఎన్టీఆర్ విగ్రహాలను ముట్టుకునే అర్హతలేదని ఫైర్ అయ్యారు.. ప్రజల కలలోకి వచ్చి ఎన్టీఆర్ ఆత్మే చంద్రబాబు దుర్మార్గాలు చెబుతుందన్నారు.. ఇక, చంద్రబాబులో…
Tammineni Sitaram: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ రాజధాని సాధన ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ రాజధానిగా రావాలని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు చరిత్ర ఉందని.. నాడు ప్రజల తీవ్రమైన భావావేశాన్ని ప్రదర్శించి గట్టిగా అడిగారన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, జీవించే హక్కు కోసం…
Tammineni Sitaram: అమరావతి రైతుల పాదయాత్రపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం విమర్శలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అది రైతుల యాత్ర కాదని.. బినామీ యాత్ర అని వర్ణించారు. పాదయాత్ర చేసేది రైతులు కాదని తాము తొలిరోజు నుంచి చెప్తున్నామని.. ముసుగువీరులు ఎవరో శాసనసభలోనే చెప్పామని తమ్మినేని సీతారాం గుర్తుచేశారు. 28వేల మంది వద్ద బలవంతంగా భూములు లాక్కొంటే పాదయాత్రకు ఎంత మంది వచ్చారో అందరూ చూశారన్నారు. ఐడెంటెటీ కార్డులు కేవలం 70…
Tammineni Sitaram: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రకు 14 ఏళ్లు పాలించిన టీడీపీ ఏం చేసిందో.. గత మూడేళ్లలో తాము ఏం చేశామో చర్చకు సిద్ధమని.. టీడీపీ సిద్ధంగా ఉందా అని తమ్మినేని ప్రశ్నించారు. గుడ్డిగా విమర్శిస్తున్న వారికి అభివృద్ధి ఏం కనిపిస్తుందని సెటైర్లు వేశారు. ఎన్నికల్లో ప్రజలు తీర్పునిస్తారని.. ఎవరు ఎలాంటివారో అప్పుడు అచ్చెన్నాయుడికి దద్దమ్మలెవరో తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ చర్చకు అచ్చెన్నాయుడి లాంటి…