గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ 5th ఎడిషన్ పోస్టర్ రిలీజ్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం, ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల్లో కేన్సర్ రన్ నిర్వహిస్తున్నారు. కేన్సర్ నిర్మూలన లక్ష్యంగా అక్టోబర్ 9న విజయవాడ లో గ్రేస్ కేన్సర్ రన్ నిర్వహిస్తున్నాం. కేన్సర్ అవగాహన,నిర్మూలనలో గిన్నిస్ రికార్డ్ సాధించాం. ఏపీ ప్రభుత్వం తో ఒప్పందం చేసుకుని కేన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు గౌతమ్ రెడ్డి.
Read Also: Bigg boss 6: మూడోవారం ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. కేన్సర్ మహమ్మారి చాలామంది ప్రాణాలు బలిగొంటుంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి గ్రేస్ కాన్సర్ రన్ ఉపయోగపడుతుంది. కేన్సర్ ని నివారణపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా పెద్ద ఎత్తున వైద్య సేవలు ప్రభుత్వం అందిస్తుంది. ఆరోగ్యశ్రీ గురించి విదేశాల్లో కూడా అడుగుతున్నారు. గ్రామాల్లో స్క్రీనింగ్ ద్వారా గ్రేస్ ఫౌండేషన్ సేవలు చేస్తుంది. అక్టోబర్ 9 న కాన్సర్ పై అవగాహన కోసం నిర్వహిస్తున్న గ్రేస్ కాన్సర్ రన్ ను అందరు విజయవంతం చెయ్యాలని స్పీకర్ తమ్మినేని పిలుపునిచ్చారు.
Read Also: Woman Married Husband Friend: త్రిపుల్ తలాక్ చెప్పిన భర్తకు దిమ్మతిరిగే షాక్