సీఎం వైఎస్ జగన్ అనుకున్నది సాధిస్తారని తెలిపారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. సింహాచలంలో లక్ష్మీ నృసింహ్మ స్వామిని దర్శించుకున్నఆయనకు ఘనంగా స్వాగతం పలికారు ఆలయ ఈవో, అధికారులు, వైదిక వర్గాలు.. ఆ తర్వాత గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. పంచగ్రామాల భూసమస్య అన్నది నేను పుట్టక ముందునుంచే ఉందన్నారు.. వైసీపీ పరిపాలనా రాజధాని విషయంలో ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందన్న ఆయన.. గత ప్రభుత్వం వేసిన అభివృద్ధి…
ఎంపీ రామ్మోహన్ నాయుడికి తమ్మినేని సీతారాం కుమారుడు రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ కౌంటర్ ఇచ్చారు. వ్యాక్సిన్, కరోనా చికిత్స గురించి ఎంపీ రామ్మోహన్ నాయుడు అవాస్తవాలు మాట్లాడుతున్నారని..వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని చురకలు అంటించారు. దేశంలో ఏ రాష్ట్రం బయటి దేశాల నుంచి వ్యాక్సిన్ తెచ్చుకోవడం లేదని..అలాంటి పరిస్థితులు ఉంటే నిరూపించాలని రామ్మోహన్ నాయకుడికి సవాల్ విసురుతున్నానని పేర్కొన్నారు. మీ నాయకుడు చంద్రబాబు.. హైదరాబాద్ లో కూర్చుని జూమ్ మీటింగ్…
టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ట్వీట్ పై స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. జగన్ మోహన్ రెడ్డి గజేంద్రుడిలా పని చేసుకుపోతున్నారు. జగన్ వెనుక కొన్ని కుక్కలు మొరుగుతాయ్ అవన్నీ పట్టించుకోనవసరం లేదు. మేం ట్వీట్ లు పెట్టడం మొదలు పెడితే స్పేస్ కూడా సరిపోదు. సభాపతిగా నాకు కొన్ని పరిమితులున్నాయ్. కానీ అచ్చెన్నాయుడి ట్వీట్ చూస్తుంటే బ్లడ్ బాయిల్ అవుతోంది అని అన్నారు. 17తర్వాత టీడీపీ లేదు డాష్ లేదు అని ఆయన అన్నదే కదా……