ప్రతిపక్ష హోదా ఇవ్వండి అసెంబ్లీ సమావేశాలకు వస్తామన్న మా డిమాండ్ కు కూటమి ప్రభుత్వం తోక ముడుస్తుందని విమర్శించారు శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం..
తనకు వ్యాధి వచ్చింది, జబ్బు వచ్చిందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. 'నాయకులకు, కార్యకర్తలకు నా ముఖ్యమైన విజ్ఞప్తి. ఇది అసత్యం... ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. నిరంతరం ప్రభుత్వ కార్యక్రమాల్లో తిరగడంతో కాస్తా డీ హైడ్రేషన్ కి గురి అయ్యానని తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం మెడికవర్ ఆసుపత్రిలో అబ్జర్వేషన్ లో ఉన్నానని.. సోమవారం నుండి యథావిధిగా ప్రభుత్వ,…
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో సామాజిక సాధికారిక యాత్ర బహిరంగ సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రసంగించారు. పాతపట్నంలో ఈ జనవాహిని చూస్తుంటే సముద్రం పొంగివచ్చిందా అన్న రీతిలో హాజరయ్యారన్నారు. పార్టీ పట్ల, జగన్ పట్ల, మీ నాయకురాలి పట్ల అభిమానం కనపడుతోందన్నారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేశారన్నా వార్త తనకు ఇప్పుడే తెలిసిందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. ఓఎస్డీ ద్వారా సమాచారం అందిందన్నారు. ఆర్కే ఎందుకు రాజీనామా చేశారన్న స్పష్టత గురుంచి తనకు తెలియదన్నారు.
ప్రతిపక్షాలు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని.. అది తప్పు అని చెప్పడానికే ఈ సభ ఉద్దేశమని విజయనగరం జిల్లా రాజాంలో సామాజిక సాధికారిక యాత్రలో స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. జగన్మోహన్ రెడ్డి సామాజిక, సాధికారిక జైత్రయాత్ర ఇది అంటూ ఆయన పేర్కొన్నారు. జోగులు అందరివాడు.. సామాన్య జనంతో కలిసిపోయే మనసత్వం ఉన్న వ్యక్తి అని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.
జగన్ జైత్ర యాత్రను ఆపే శక్తి ఎవరికి లేదని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. పేదవాడు ఆకలితో చస్తుంటే... రోడ్లు వేసి అభివృద్ది అంటే ఎలా అని.. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే అభివృద్ధి అని పేర్కొన్నారు.
సీఎంగా మళ్లీ జగన్ ని చేస్తేనే భవిష్యత్ బాగుంటుందని వ్యాఖ్యనించారు. చారిత్రక అవసరం ఉంది.. అలా కాకుంటే దేశం కుడా క్షమించదు అని ఆయన పేర్కొన్నారు. సామాజిక సాధికార యాత్రనే కాదు స్వాభిమాన యాత్ర కూడా అని స్పీకర్ తమ్మినేని సీతారం చెప్పారు.