కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ కారణంగా దేశంలో రోజువారీ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతుండటంతో పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. ఇక తమిళనాడులో రోజువారీ కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు పెరుగుతున్నది. దీంతో అక్కడ నైట్ కర్ఫ్యూతో పాటు వీకెండ్‌లో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు సైతం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఆదివారం రోజున సంపూర్ణ లాక్‌డౌన్‌ను…
కోలీవుడ్ స్టార్ హీరో శింబు అరుదైన గౌరావాన్ని అందుకున్నాడు. తమిళనాడులోని ప్రముఖ వేల్స్ యూనివర్సిటీ శింబును డాక్టరేట్ తో గౌరవించింది. అతి చిన్న వయస్సులో డాక్టరేట్ అందుకున్న వ్యక్తుల్లో శింబు ఒకదిగా మారిపోయాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేశారు. ” నాకు ఈ గౌరవాన్ని అందించిన వేల్స్ యూనివర్సిటీకి ధన్యవాదాలు.. ఈ గౌరావాన్ని నేను నా తల్లిదండ్రులకు అకింతమిస్తున్నాను. నాకు ఈ సినిమాను పరిచయం చేసి, ఇక్కడి వరకు తీసుకొచ్చింది వారే..…
స్వేచ్ఛగా తిరిగే పావురం అక్కడ బందీగా మారింది. ఎందుకంటే ఆ పావురం కాలికి వున్న ట్యాగ్. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో పావురాలు కలకలం రేపుతున్నాయి. తిరుపతి ఆటో నగర్ లో పావురం అందరినీ హడలెత్తించింది. పావురానికి కాలికి ట్యాగ్ ను గుర్తించారు స్థానికులు. అది ఎక్కడినుంచి ఎగురుకుంటూ వచ్చిందోనని అంతా ఆందోళనకు గురయ్యారు. అనంతరం పరిశీలనలో తమిళనాడు నుండి వచ్చిన రేస్ పావురంగా గుర్తించారు. ఈమధ్యకాలంలో తిరుపతిలో ఇలాంటి పావురాలు అనేకం కనిపిస్తున్నాయి. తిరుపతిలో రెండురోజుల క్రితం…
కరోనా నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టుకు అనుమతిస్తూ సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా నెగిటివ్ వచ్చిన వారినే అనుమతించాలని, తక్కువ సంఖ్యలో ప్రేక్షకులకు అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్టాలిన్ సూచించారు. Read Also: రూల్స్ బ్రేక్ చేస్తున్న ప్రజాప్రతినిధులు కాగా సంక్రాంతి పండుగలో ఎద్దులను మచ్చిక చేసుకుని లొంగదీసుకునే ఆటే జల్లికట్టు. ఇందుకోసం…
సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులు. అయితే, ఓ వర్గం నిబంధనల్ని తుంగలోకి తొక్కి చేపల్ని వేటాడుతోంది. దీంతో మరో వర్గం ఆకలితో అలమటిస్తోంది. ప్రకాశం జిల్లాలో తమిళనాడు మత్స్యకారుల దోపిడీ హాట్ టాపిక్ అవుతోంది. ప్రకాశం జిల్లా మత్స్యకారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తమిళనాడు నుంచి వస్తున్న మెకనైజ్డ్ బోట్లు మత్స్య సంపదను దోచుకుపోతుండడంతో ఆకలితో అలమటిస్తున్నారు స్థానిక జాలర్లు. కడుపు కాలి ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తే వలల్ని, బోట్లను ధ్వంసం చేస్తున్నారు. భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారు…
పాన్ ఇండియా సినిమాలకు వరుసగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే సినిమాలను విడుదల చేసిన వాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకుంటుంటే… మరికొన్ని రోజుల్లో విడుదల కావాల్సిన సినిమా మేకర్లను కరోనా, దాని కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రెండూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న కేసుల కారణంగా దేశంలోని రాష్ట్రాలు ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో ఇప్పటికే సినిమాలను పలుమార్లు వాయిదా వేసుకున్న పాన్ ఇండియా సినిమాలకు దెబ్బ మీద దెబ్బ పడినట్టుగా అయ్యింది. తాజాగా తమిళనాడు ప్రభుత్వం…
కరోనా మహమ్మారి ఇంకా మనల్ని వీడలేదు. కరోనా కంటే వేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజూ పెరుగుతోంది. ఇప్పటి వరకు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ విస్తరించినట్టు సమాచారం. రాజస్థాన్లో 21, దిల్లీలో 12, కేరళలో 8 ఒమిక్రాన్ కేసులు కొత్తగా బయటపడడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. తమిళనాడులో ఒమిక్రాన్ ఒక్కసారిగా విజృంభించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడంతో అంతా అలర్ట్ అయ్యారు. మహారాష్ట్రలోని…
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. తక్కువ కులం అబ్బాయిని ప్రేమించిందని సొంత అక్కను తమ్ముడు గొంతుకోసి హత్య చేసిన దారుణ ఘటన రామనాథపురంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. నెహ్రునగర్ 5వ వీధిలో సెల్వం అనే వ్యక్త్రి కుటుంబం నివసిస్తోంది. అతనికి ఇద్దరు కూతుళ్లు , ఒక కుమారుడు. ఈ నేపథ్యంలోనే కుటుంబం మొత్తం పెద్ద కూతురు స్వాతికి వివాహం చేయాలనీ నిశ్చయించారు. వరుసగా పెళ్లి సంబంధాలు తీసుకొస్తుంటే స్వాతి వాటన్నింటిని తిరస్కరిస్తూ వస్తుంది. ఒకరోజు స్వాతి పిన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని కాపాడుకునేందుకు కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఇన్నుయిర్ కాప్పొమ్ పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ప్రకారం, రోడ్డు ప్రమాదం జరిగిన తరువాత వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందించాలని, రోడ్డు ప్రమాదం బారిన పడిన వ్యక్తిని కాపాడేందుకు మొదటి 48 గంటలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని స్టాలిన్ పేర్కొన్నారు. Read: ముంబైలో కాంగ్రెస్ సభపై నీలిమేఘాలు……
ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి. తెరకెక్కించిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. అలానే కొన్ని సినిమాలు అనువదించబడ్డాయి. అలా ఆయన రూపొందించిన హారర్ మూవీ 2014లో ‘అరణ్మనై’ను తెలుగులో ‘చంద్రకళ’ పేరుతో డబ్ చేశారు. దానికి సీక్వెల్ గా సుందర్ సి. తెరకెక్కించిన ‘అరణ్మనై -2’ కూడా ‘కళావతి’ పేరుతో అనువాదమైంది. తాజాగా ఈ యేడాది అక్టోబర్ లో తమిళంలో విడుదలైన ‘అరణ్మనై -3’ సినిమాను ‘అంతఃపురం’ పేరుతో డబ్ అవుతోంది. ఆర్య, రాశిఖన్నా,…