తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. తక్కువ కులం అబ్బాయిని ప్రేమించిందని సొంత అక్కను తమ్ముడు గొంతుకోసి హత్య చేసిన దారుణ ఘటన రామనాథపురంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. నెహ్రునగర్ 5వ వీధిలో సెల్వం అనే వ్యక్త్రి కుటుంబం నివసిస్తోంది. అతనికి ఇద్దరు కూతుళ్లు , ఒక కుమారుడు. ఈ నేపథ్యంలోనే కుటుంబం మొత్తం పెద్ద కూతురు స్వాతికి వివాహం చేయాలనీ నిశ్చయించారు. వరుసగా పెళ్లి సంబంధాలు తీసుకొస్తుంటే స్వాతి వాటన్నింటిని తిరస్కరిస్తూ వస్తుంది.
ఒకరోజు స్వాతి పిన్ని కొడుకు శరవణన్ ఎందుకు పెళ్లి వద్దంటున్నావ్ .. మంచి సంబంధం చేసుకో అక్కా అని అడుగగా.. ఆమె తన ప్రేమ విషయాన్ని తమ్ముడికి చెప్పింది. ప్రియుడి వివరాలు కనుక్కొన్న తమ్ముడు అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. అతడు తమకన్నా తక్కువ కులం అని, అతడిని మర్చిపోయి ఇంట్లో చెప్పినవారిని పెళ్లి చేసుకోవాల్సిందిగా నచ్చజెప్పాడు. అయినా స్వాతి ప్రేమించిన వాడినే వివాహమాడతానని చెప్పింది. ఈ క్రమంలోనే ఇటీవల స్వాతి ఇంటికి వచ్చితిన్ శరవణన్ మరోసారి అక్కతో గొడవపడ్డాడు. తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే పరువు పోతుందని బెదిరించాడు. అయినా స్వాతి వినకపోయేసరికి ఆమె గొంతు కోసి పరారయ్యాడు. రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటూ స్వాతి అక్కడిక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్ననిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు.