ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి. తెరకెక్కించిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. అలానే కొన్ని సినిమాలు అనువదించబడ్డాయి. అలా ఆయన రూపొందించిన హారర్ మూవీ 2014లో ‘అరణ్మనై’ను తెలుగులో ‘చంద్రకళ’ పేరుతో డబ్ చేశారు. దానికి సీక్వెల్ గా సుందర్ సి. తెరకెక్కించిన ‘అరణ్మనై -2’ కూడా ‘కళావతి’ పేరుతో అనువాదమైంది. తాజాగా ఈ యేడాది అక్టోబర్ లో తమిళంలో విడుదలైన ‘అరణ్మనై -3’ సినిమాను ‘అంతఃపురం’ పేరుతో డబ్ అవుతోంది.
ఆర్య, రాశిఖన్నా, ఆండ్రియా కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను డిసెంబర్ 31న తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఈ హారర్ కామెడీ చిత్రంలో సాక్షి అగర్వాల్, స్వర్గీయ వివేక్, మైనా నందిని, యోగి బాబు, నళిని, మనోబాల, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సి. సత్య సంగీతాన్ని అందించారు. సుందర్ సి భార్య కుష్బూ ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది.