తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని కాపాడుకునేందుకు కొత్త పథకాన్ని తీసుకొచ్చారు. ఇన్నుయిర్ కాప్పొమ్ పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ప్రకారం, రోడ్డు ప్రమాదం జరిగిన తరువాత వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్యం అందించాలని, రోడ్డు ప్రమాదం బారిన పడిన వ్యక్తిని కాపాడేందుకు మొదటి 48 గంటలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని స్టాలిన్ పేర్కొన్నారు.
Read: ముంబైలో కాంగ్రెస్ సభపై నీలిమేఘాలు…
ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదాల బారిన వారిని ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. దీనికోసం రాష్ట్రంలో 201 ప్రభుత్వ, 408 ప్రైవేట్ ఆసుపత్రులను ఎంపికచేసినట్టు తెలిపారు. తమిళనాడుకు చెందిన వ్యక్తులే కాకుండా ఎవరైనా సరే తమిళనాడులో రోడ్డు ప్రమాదానికి గురైతే వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. చెంగల్‌పట్టు జిల్లాలోని మేల్ మరువత్తూర్‌లోని ఆదిపరాశక్తి వైద్య కళాశాలలో ఈ పథకాన్ని సీఎం స్టాలిన్ ప్రారంభించారు.