పెంపుడు జంతువుల్లో కుక్క చాలా విశ్వాసంగా ఉంటుంది. అందుకే చాలా మంది కుక్కలను ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు. ఇటీవల కుక్కలు చనిపోయినా తట్టుకోలేని వాళ్లు వాటి మీద ప్రేమతో అంత్యక్రియలు కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా తమిళనాడులోని ఓ రైతు కుక్క కోసం గుడి కట్టేశాడు. ఇప్పటివరకు తమిళనాడులో హీరోయిన్‌లకు గుడి కట్టిన వాళ్ల గురించే విన్నాం.. చూశాం. కానీ ఇప్పుడు కుక్క కోసం గుడి కట్టడం కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది కదూ. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని శివగంగ…
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో జనం జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీంతో జనం ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నారు. వీరికి ఎలక్ట్రిక్ బైక్ లు ఊరట నిస్తున్నాయి. ప్రారంభంలో ఖర్చు ఎక్కువే వున్నా.. రోజూ పెట్రోల్ బంకులకు వెళ్లే అవకాశం లేదు. ఒకసారి ఛార్జి చేస్తే వంద కిలోమీటర్ల వరకూ మైలేజ్ వస్తుంది. ఛార్జింగ్ పాయింట్లు కూడా అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఎలక్ట్రిక్ బైక్ ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే, ఈ ఎలక్ట్రిక్ బైక్ లు అంత సేఫ్…
కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. కళ్ళలో పెట్టుకుని కాపురం చేయాల్సిన మొగుడు ఆమెని అతి కిరాతకంగా హతమార్చాడు. భార్యను బతికుండగానే అడవిలో పూడ్చిపెట్టాడో కర్కోటక భర్త ఉదంతమిది. తమిళనాడులో కలకలం రేపిన శాడిస్టు భర్త తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది, బతికున్న భార్యను పూడ్చి పెట్టిన భర్త తాపీగా తన పనులు తానుచేసుకోవడం ప్రారంభించాడు. వేలూరు జిల్లా కాట్పాడీలో ఈ ఘటన జరిగింది. నాలుగేళ్ళ క్రితం సుప్రజ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు వినాయకం. అనుమానంతో పాటు అనారోగ్యంతో…
ఈమధ్యకాలంలో యువత మోడ్రన్ బైక్ లపై ఆసక్తి కనబరుస్తున్నారు. మార్కెట్లోకి వచ్చే బైక్ లు ఎంత ఖరీదైనా వారు కొనేసి, హాయిగా తినేస్తున్నారు. తమిళనాడుకి చెందిన యువకుడు భూపతికి బైక్ కొనాలనిపించింది. అక్షరాలా రెండున్నర లక్షల రూపాయల పెట్టి బైక్ కొనేశాడు. అదేం పెద్ద న్యూస్ కాదు కానీ. ఆ బైక్ కొనేందుకు అతను ఉపయోగించిన పద్ధతి అందరికి ఆశ్చర్యాన్ని, బైక్ షోరూం సిబ్బందికి కాసింత విసుగును పుట్టించింది. అంతా డిజిటల్ మనీ ఉపయోగిస్తున్న ఈరోజుల్లో రెండున్నర…
అప్పుడప్పుడు జీవితంలో మనం ఊహించని అద్భుతాలు ఎన్నో జరుగుతుంటాయి. కానీ ఆ అద్భుతాలు మన కళ్ల ముందు జరిగితే నోరెళ్లబెట్టడం తప్ప ఏమీ చేయలేం. అయితే దేవుడి సన్నిధిలో వింత జరిగితే అది మహాద్భుతమే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో తమిళనాడులోని ఓ ఆలయంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ మేక ప్రతిరోజూ ఆలయానికి వచ్చి గంట మోగిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. తిరునెల్వేలి జిల్లాలోని కలక్కాడ్ గ్రామం తొప్పు వీధిలో ఉండే అరుల్మిగు అంగాలా పరమేశ్వరీ ఆలయానికి…
మహిళలపై వరుసగా దారుణాలు జరుగుతూనే ఉన్నాయి.. రోజూ ఏదో ఒక చోటు ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.. ఇక, తమిళనాడులో ఓ వైద్యురాలిపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపుతోంది.. తనతో ఉన్న స్నేహితుడిపై దాడి చేసి బెదిరించిన ఆటో డ్రైవర్లు.. ఆ తర్వాత యువ డాక్టర్‌పై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన సంచలనంగా మారింది.. వేలూరు సత్‌వచ్చారిలో జరిగిన ఈ ఘటన విస్మయానికి గురిచేస్తోంది. Read Also: COVID 19: ఆ వేరియంట్‌తో మళ్లీ ముప్పు..…
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ శుక్రవారం నాడు తన గర్ల్‌ఫ్రెండ్, భారతీయ యువతి వినీ రామన్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని మ్యాక్స్‌వెల్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తమిళనాడుకు చెందిన వినీ రామన్‌తో ప్రేమలో ఉన్న అతడు.. 2020 ఫిబ్రవరిలోనే నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే కరోనా కారణంగా మ్యాక్స్‌వెల్ పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. కాగా మ్యాక్స్‌వెల్-వినీ రామన్ జంటకు ఆస్ట్రేలియా క్రికెటర్లు, బెంగళూరు రాయల్…
దివంగత మాజీ సీఎం జయలలిత మరణం మిస్టరీని నిగ్గు తేల్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్ మళ్లీ విచారణకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వంకు ఆర్ముగ స్వామి కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉండగా ఆయన డుమ్మా కొడుతూ వచ్చారు. దీంతో ఈనెల 21న పన్నీర్ సెల్వం విచారణకు హాజరు కావాలని తాజా నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. మరోవైపు…
తమిళనాడు మంత్రి శేఖర్‌బాబు కుమార్తె జయకళ్యాణి ప్రేమ వివాహం చేసుకుంది. బెంగళూరులోని హిందూ ధార్మిక సంస్థలో సోమవారం నాడు సతీష్అనే యువకుడితో మంత్రి కుమార్తె వివాహం జరిగింది. తమ ప్రేమకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇలా ప్రేమ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని జయకళ్యాణి వివరణ ఇచ్చింది. అయితే తన తండ్రి నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఆమెతో పాటు ఆమె భర్త సతీష్ పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. కొన్ని నెలల క్రితం…
ఉక్రెయిన్‌పై రష్యా భీకర రీతిలో యుద్ధం చేస్తోంది. ఈ కారణంగా ఉక్రెయిన్‌లో భయానక వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ చదువుతున్న భారతీయ విద్యార్థులందరూ స్వదేశానికి వచ్చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే కొంతమంది భారతీయులు ఇంకా అక్కడే చిక్కుకుపోయి బిక్కుబిక్కుమంటున్నారు. ఈ నేపథ్యంలో తన కుమారుడు సురక్షితంగా తిరిగొస్తాడో, లేదో అనే ఒత్తిడిని తట్టుకోలేక ఓ తల్లి ప్రాణం విడిచింది. తమిళనాడు తిరుపత్తూరుకు చెందిన శక్తివేల్ ఉక్రెయిన్ లో చదువుకుంటున్నాడు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి…