కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత దానిని తీసుకోవడానికి చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే ఎక్కడ ఇబ్బందులు ఎదురౌతాయో అని భయపడుతున్నారు. దీంతో ముందుకు రావడంలేదు. యువతకు వ్యాక్సిన్ వేయించేందుకు అధికారులు, సామాజిక సంస్థలు అనేక తంటాలు పడుతున్నాయి. చెన్నై శివారు ప్రాంతమైన కోవలం గ్రామంలో 14,300 మంది మత్య్సకారులు ఉన్నారు. వీరిలో 18 ఏళ్లకు పైబడిన వ్యక్తులు 6వేలకు పైగా ఉన్నారు. వీరిలో మొదట 58 మంది మాత్రమే టీకా…
కరోనా.. ప్రస్తుతం మన దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. అటు కరోనాకు చెక్ పెట్టేందుకు.. వ్యాక్సిన్ ప్రక్రియను అన్నీ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇంతలోనే.. నెల్లూరు ఆయుర్వేద మందు అని పెద్ద వివాదమే కొనసాగుతోంది. ఇంకా మిగతా చోట్ల కూడా కరోనాకు మందు కనిపెట్టే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కరోనాకు విరుగుడు అంటూ చచ్చిన పామును కొరికి నమీలేశాడు తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి. మధురై జిల్లా పేరుమపత్తికి…
బీర్ బాటిళ్లను సరఫరా చేస్తున్న జొమాటో డెలివరీ బాయ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. తమిళనాడులోని చెన్నై నగరంలో కేజీ రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానంగా కనిపించిన జొమాటో డెలివరీ బాయ్ వాహనాన్ని చెక్ చేశారు. దీంతో ఫుడ్ ఉండాల్సిన జొమాటో బాక్స్‌లో బీర్ బాటిళ్లు దర్శనమిచ్చాయి. కోడంబాక్కంకు చెందిన ప్రసన్న వెంకటేష్ గా నిందితున్ని గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
కరోనా కట్టడిలోనై తన మార్క్ చూపిస్తున్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. మాస్క్ ధరించడంపై స్వయంగా ఓ వీడియోను రూపొందించి విడుదల చేశారు.. ఇక, కోవిడ్ కట్టడిలో తామున్నామంటూ ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారు సినీ తారలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు.. తాజాగా, కోవై జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు పలు సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఏకుంగా రూ.32 కోట్ల విరాళాలు అందజేశారు. ఈ మేరకు తమిళనాడు సచివాలయం ప్రకటన విడుదల చేసింది.. పరిశ్రమల నగరం కోయంబత్తూర్ జిల్లాలో…
తమిళనాడులో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 25 రోజుల వ్యవధిలో తమిళనాడులో 25 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అటు చెన్నై మహానగరంలోనూ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటె కోయంబత్తూరు జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. ఆ జిల్లాలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఆసుపత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. కోవి నగరంలోనూ కేసులు భారీగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కోయంబత్తూరు జిల్లాలో హోమ్ ఐసోలేషన్ లో ఉండే…
నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం శాసనసభ ఎన్నికలు ముగిసి నూతన ప్రభుత్వాలు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తమిళనాడు మినహా మిగిలిన రాష్ట్రాల్లో వున్న ప్రభుత్వాలే తిరిగి వస్తున్నాయి. పుదుచ్చేరిలో ప్రభుత్వం మారుతున్నా అదే నేతలు పార్టీలు మారి కొత్త రూపంలో వస్తున్నారు. కనుకనే ఈ అయిదు ఎన్నికలు ఒకే పాఠం ఇస్తున్నాయి. అన్నిటిలోకి అత్యంత నాటకీయంగా కనిపించేది పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఘన విజయం. ప్రధాని మోడీ హోం మంత్రి అమిత్ షా ప్రత్యక్షంగా మకాం వేసి ఆ…
ప్రముఖ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తన ఫోన్ నంబర్ లీక్ అయిందని, బిజెపి తమిళనాడు ఐటి సెల్ తన నంబర్ లీక్ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగా ఆయనకు, ఆయన కుటుంబానికి అత్యాచారం, డెత్ బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు సిద్ధార్థ్. ఈ మేరకు ట్వీట్లో “నా ఫోన్ నంబర్ ను తమిళనాడు బిజెపి సభ్యులు, బిజెపి తమిళనాడు ఐటి సెల్ లీక్ చేసారు. నాకు, నా కుటుంబానికి 24 గంటల్లో…
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇక కరోనా ఆసుపత్రులను పెంచుతూ ఇప్పటికే అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా రోగులకు టెస్టులు నిర్వహిస్తూ చికిత్స అందిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, తమిళనాడులోని కొడైకెనాల్ లోని కరోనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు రోగులు సడెన్ గా ఆసుపత్రి నుంచి పరారయ్యారు. దీంతో వైద్యులు షాక్ అయ్యారు. నాలుగురోజుల క్రితం గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి కూతురిని చూసేందుకు…
దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే వాటిల్లో మద్యం కూడా ఒకటి. మద్యం వలన ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం వస్తుంటుంది. కొన్ని రాష్ట్రాల్లో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అలాంటి రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. ఇక ఇదిలా ఉంటె, తమిళనాడులోని అరియలూరుకు చెందిన సురేష్ అనే వ్యక్తి స్థానిక ప్రభుత్వ మద్యం దుకాణంలో బాటిల్ కొనుగోలు చేశాడు. సగం తాగిన తరువాత చూస్తే అందులో పాము పిల్ల కనిపించింది. బాటిల్ లో పాము కనిపించేసరికి మద్యం మత్తు దిగిపోయింది. వెంటనే ఎక్కడైతే కొనుగోలు…