ప్రస్తుత కాలంలో ఓ మనిషి మరో మనిషికి సాయం చేయడమే గగనంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఏకంగా ఓ మూగజీవాన్ని కాపాడి అందరి మన్ననలు పొందుతున్నాడు. తమిళనాడులోని పెరంబలూరుకు చెందిన ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ కోతిని కాపాడి మానవత్వం చాటుకున్నాడు. ప్రమాదంలో గాయపడిన కోతి పిల్ల శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుండగా తన నోటితో దానికి గాలి అందించాడు. అది భయంతో అతన్ని కొరికినా.. ఆ వ్యక్తి దాని ప్రాణాలు…
తమిళనాడులో హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ఎగువరేగడకు చెందిన జవాన్ లాన్స్‌నాయక్ సాయితేజ అంత్యక్రియలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గ్రామ శివారులో సాయితేజకు సైనిక గౌరవవందనం నిర్వహించడానికి చిన్న మైదానాన్ని సిద్ధం చేశారు. మైదానం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.సాయితేజ మృతదేహం గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో… కుటుంబ సభ్యుల DNA శాంపిళ్ల ఆధారంగా గుర్తించారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రస్తుతం సాయి భౌతిక కాయం బెంగళూరు…
తమిళనాడులో రెండు రోజుల క్రితం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. త్రివిధ దళాల అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ జరుపుతోందని IAF వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలు విచారణలో బయటకు వస్తాయని.. అప్పటివరకు ప్రమాదంపై ఎటువంటి ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని కోరింది. దర్యాప్తు పూర్తయ్యేవరకు తప్పుడు ప్రచారం వద్దని.. ప్రాణాలు కోల్పోయిన వారి మర్యాదను మనం కాపాడాల్సిన అవసరం ఉందని IAF పేర్కొంది. Read Also: డీఎన్‌ఏ…
నిన్న మధ్యాహ్నం సీడిఎస్ బిపిన్ రావత్ ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ కూనూరు వద్ద కూలిపోయిన సంగతి తెలిసిందే. టీ ఎస్టేట్‌కు సమీపంలో కూలిపోవడంతో అందులో పనిచేస్తున్న కూలి శివ అనే వ్యక్తి వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. మంటల్లో కాలిపోతున్న ఓ వ్యక్తిని చూశానని, మంచినీళ్లు అడిగారని, అయితే, నీళ్లు ఇవ్వకుండా గుడ్డలో చుట్టి పైకి తీసుకెళ్లి ఆర్మీకి అప్పగించానని, మూడు గంటల తరువాత చనిపోయి ఆ వ్యక్తి బిపిన్ రావత్ అని, దేశానికి ఎంతో సేవచేసిన…
హెలికాప్టర్ ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యం అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలకు ఈ బ్లాక్ బాక్స్ దొరికింది. ప్రమాద స్థలం నుంచి 30 అడుగుల దూరంలో బ్లాక్ బాక్స్ లభ్యమైనట్లు… ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలు తెలిపాయి. దీంతో బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఆర్మీ అధికారులు. అనంతరం బ్లాక్ బాక్స్ ను విశ్లేషణ కోసం ఢిల్లీ బృందం ప్రమాద ఘటనా స్థలం నుంచి తీసుకు వెళ్ళింది. కాగా…తమిళ నాడు రాష్ట్రంలో నిన్న…
భారత్‌లో అత్యంత శక్తివంతమైన సైనికాధికారి బిపిన్ రావత్ ఈరోజు మధ్యాహ్నం హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఉదయం ఢిల్లి నుంచి తమిళనాడులోని వెల్లింగ్టన్ ఆర్మీ కళాశాలకు వెళ్తున్న సమయంలో కూనూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, మరో 11 మంది సైనికులు మృతి చెందారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో జన్మించిన బిపిన్ రావత్ ప్రాథమిక విద్యను డెహ్రడూన్, సిమ్లాలో పూర్తిచేశారు. తండ్రి ఇచ్చిన స్పూర్తితో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో…
తమిళనాడులోని వెల్లూరులో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీంతో పలుచోట్ల భూమి బీటలు వారడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో నిద్రపోతున్న ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 3.6గా తీవ్రత నమోదైందని అధికారులు వెల్లడించారు. వెల్లూరుకు 59 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉందని వారు తెలిపారు. భూ అంతర్భాగంలో 25 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ అధికారులు పేర్కొన్నారు. అయితే భూకంపం వల్ల…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇప్పటికే 8 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించిన సర్కార్, ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక చెన్నైని వర్షాలు ముంచెత్తున్నాయి. చలి, వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. Read: దేశంలో చమురుధరలు దిగిరాబోతున్నాయా? ఇన్ని రోజులుగా, ఈ స్థాయిలో వర్షాలు కురవడం ఇప్పటి వరకు చూడలేదని, భారీ వర్షాలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని…