కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ కారణంగా దేశంలో రోజువారీ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతుండటంతో పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. ఇక తమిళనాడులో రోజువారీ కేసులు 20 వేలకు పైగా నమోదవుతున్నాయి. పాజిటివిటీ రేటు పెరుగుతున్నది. దీంతో అక్కడ నైట్ కర్ఫ్యూతో పాటు వీకెండ్‌లో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు సైతం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఆదివారం రోజున సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధిస్తుండటంతో కొంతమేర సత్ఫలితాలు ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. కరోనాను కట్టడి చేయాలంటే దాని వ్యాప్తిని తగ్గించాలని, వ్యాప్తి తగ్గించాలంటే రద్దీని తగ్గించాలని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఆదివారం రోజున లాడ్‌డౌన్ అమలు చేయ క్రమంలో ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ తప్పనిసరి పరిస్థుతుల్లో నిబందనలు, లాక్‌డౌన్‌లు అమలు చేయక తప్పడం ఏదని అధికారులు అంటున్నారు.