మొత్తానికి పెట్రోల్ ధరలను టమాటా దాటేసింది. ఇది సామాన్యుడి నిత్యావసరం. ఏదో ఒక రకంగా ఏ వంటకంలో అయినా టమాటా ఉండాల్సిందే. ఐతే ఇప్పుడు చాలా వాటిలో కనిపించట్లేదు. పప్పు చారు..సాంబారు మాత్రమే కాదు ఇడ్లీ చట్నీల్లో కూడా పత్తా లేదు. దేశంలో కూరగాయల ధరలకు ఈ పరిస్థితి అద్దం పడుతోంది. నిన్న మొన్నటి వరకు కిలో 20 రూపాయలున్న టమాటా ధర ఉన్నట్టుంది వంద దాటేసింది. సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో…
కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చినప్పటినుంచి అన్ని నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ అలాగే వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వాటిని కొనుగోలు చేసేందుకు సామాన్య ప్రజలు.. భయపడిపోతున్నారు. ఇక తాజాగా… టమాట ధరలు కూడా సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం టమాటో ధరలు కిలో ధర 130 రూపాయలు దాటేసింది. దీంతో ఓటరు కొనేందుకు సామాన్య ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో తమిళనాడు ముఖ్యమంత్రి…
మద్రాస్ హైకోర్టు బుధవారం నాడు కీలక తీర్పును వెల్లడించింది. దివంగత సీఎం జయలలిత నివాసం వేద నిలయాన్ని స్మారక మందిరంగా మార్చడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో గత ప్రభుత్వం(అన్నాడీఎంకే సర్కారు) జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టివేసింది. జయలలిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని కోర్టు వ్యాఖ్యానించింది. మూడు వారాల్లో వేద నిలయాన్ని జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌కు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. Read Also:…
తమిళనాడులో విల్లుపురం జిల్లా, కడలూరు జిల్లా సరిహద్దు గ్రామాల వద్ధ దక్షిణ పెన్నానదిపై రూ.25 కోట్ల రూపాయలతో చెక్‌డ్యామ్‌ను నిర్మించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ డ్యామ్‌ను వినియోగంలోకి తీసుకొచ్చారు. కాగా ఈ ఏడాది జనవరి 23 వ తేదీన ఆనకట్ట క్రస్ట్‌గేట్ల గోడ పాక్షికంగా దెబ్బతిన్నది. గోడ పగుళ్ల నుంచి నీరు బయటకు వస్తుండటంతో ఈ వ్యవహారంలో బాధ్యులను చేస్తూ ఆరుగురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. Read: ఆ గుర్రానికి కోట్లు ఇస్తామన్నా… నో…
భర్త ఇంటికి రావడంలేదని చెప్పి ఓ మహిళ మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ కేసు దాఖలు చేసింది. సెప్టెంబర్ 15 వ తేదీ నుంచి కనిపించడంలేదని కేసులో పేర్కొన్నది. ఈ కేసును స్వీకరించిన హైకోర్టు ఆమె భర్తను వెతికి కోర్టులు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తును వేగంగా ముగించారు. దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించారు. పోలీసుల నివేదికను చూపి హైకోర్టు షాక్ అయింది. Read: నేటి నుంచి శబరిమల ఆలయంలోకి భక్తుల…
వాయుగుండం ప్రభావంతో తమిళనాడు సర్కార్ అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది.. చెన్నై నగరంలో ఉన్న అన్ని సబ్వేలను మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.. మరో రెండు రోజులపాటు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.. ప్రజలు ఎవరు బయటికి రావొద్దని సూచించారు. ఇక, లోతట్టు ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు వరద ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు అధికారులు.. కాగా,…
ఇటీవలే దీపావళి వేడుకలు ముగిశాయి. దీపావళి అంటే దీపాలు వెలిగించి టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటారు. దీపావళి వేడుకలను దక్షిణ భారతదేశంలో మూడు రోజులు నిర్వహిస్తే, ఉత్తరాదిన ఐదు రోజులు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో దీపావళి వేడుకలు చాలా విచిత్రంగా జరుగుతాయి. కర్ణాటక- తమిళనాడు బోర్డర్‌లో గమటిపురా అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో దీపావళి వేడుకలను చాలా విచిత్రంగా జరుపుకుంటారు. దీపావళి రోజున అందరిలాగే దీపాలు వెలిగించి టపాసులు కాలుస్తారు. అయితే, దీపావళి ముగింపు వేడుకలను…
దీపావళి సందడి దేశవ్యాప్తంగా ప్రారంభం అయింది. అలాగే, దీపావళి బాణసంచా దుకాణాల్లో పేలుళ్ళు ఆందోళన కలిగిస్తున్నాయి. తమిళనాడులో కళ్లకురిచ్చి జిల్లా శంకరాపురంలో బాణాసంచా దుకాణంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు విడుదలై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రోజు రోజుకు పర్యావరణ కాలుష్యం పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. బొగ్గు ఆధారిత పరిశ్రమల కారణంగా పర్యావరణం దెబ్బతింటోంది. చమురుతో నడిచే వాహనాలు, విమానాల కారణంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోంది. దీని నుంచి బయటపడేందుకు ప్రపంచదేశాలు సోలార్ వినియోగాన్ని అమలులోకి తీసుకొచ్చాయి. అయితే, సరైన అవగాహన కల్పించకుంటే ఎంత పెద్ద టెక్నాలజీ అయినా పెద్దగా వినియోగంలోకి రాదు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ అనేక పనుల కోసం బొగ్గును వినియోగిస్తున్నారు. ముఖ్యంగా బట్టల ఇస్త్రీ కోసం బొగ్గుతో నడిచే ఇస్త్రీ…