దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. కాబట్టి చేపల వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. ఈ అల్పపీడనం ప్రభావం తమిళనాడు పైనే ఎక్కువగా ఉంటుంది. 10,11,12 తేదీలలో బంగాళాఖాతంలో చేపల వేట నిషేధం నిషేధించారు. అయితే దక్షిణ తమిళనాడు పై ఎక్కువ ప్రభావం ఉంటుంది అని వాతావరణ శాఖ తెలిపింది. ఇక చెన్నై వర్షాలపై తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. చెన్నై లోని ప్రభుత్వ పాఠశాలలు, మండపాలు వెంటనే…
చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం స్టాలిన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఆ సమీక్షలో సీఎం స్టాలిన్ మాట్లాడుతూ… మూడు రోజులపాటు చెన్నైకి ఎవరూ రావొద్దు అని కోరారు. చెన్నై నుంచి ఎవరూ వెళ్లొద్దు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలి అని సూచించారు. ఇక చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సీఎం సెలవుల్లో ఉన్న…
దీపావళి అంటే పూలు, పండ్లు, స్వీట్లు, టపాసులకే డిమాండ్ ఉందనుకుంటే పొరపాటే.. ఎందుకంటే.. తమిళనాడు ప్రభుత్వానికి దీపావళి కాసుల వర్షం కురిపించింది.. ఏకంగా రూ.443 కోట్ల మందును లాగించేశారు మందుబాబులు.. పండుగ సందర్భంగా రెండు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా రూ.443 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు.. అయితే, గత ఏడాదితో పోల్చుకుంటే మాత్రం ఈ సారి రూ.24.66 కోట్ల మేర తక్కువగా మద్యం విక్రయాలు జరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక, దీపావళి వేళ…
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన తీసుకునే నిర్ణయాలపై ఇటు ప్రజలు, అటు సోషల్ మీడియాలో కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉచిత విద్య విషయంలో ఎక్కడా రాజీపడకూడదని అధికారులను ఆదేశించడంతో పాటు అసెంబ్లీకి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యే ఎవరి భోజనం వారే ఇంటి నుంచి తెచ్చుకోవాలని ఆదేశించారు. క్యాంటీన్ కూడా మూసివేయించారు. ప్రజాధనం వృథా కాకుండా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్టు వివరణ ఇచ్చారు స్టాలిన్.…
వివాహేతర సంబంధాలకు వావి వరుసలు ఉండవు.. చిన్నా, పెద్ద తేడా ఉండదు. కామంతో కళ్లు మూసుకుపోయినవారికి అస్సలు విచక్షణే ఉండదు. తాజగా ఒక 35 ఏళ్ల మహిళ.. ఓ 14 ఏళ్ల బాలుడితో శారీరక సంబంధం పెట్టుకొంది. ఆ విషయం ఇంట్లో తెలిసేసరికి ఇద్దరు కలిసి ఇంట్లోంచి పారిపోయిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. తిరువారూర్ జిల్లాలోని కూడవాసల్ తాలూకాలో బాలగురు, రసతి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి 13 ఏళ్ల కూతురు, 14…
పోలీసు డిపార్ట్మెంట్ అంటే.. ఎప్పుడు డ్యూటీకి వెళ్తారో.. మళ్లీ ఎప్పుడు వస్తారో.. అత్యవసరం అయితే మళ్లీ ఎప్పుడు కబురు వస్తుందో తెలియని పరిస్థితి.. ఏ కార్యక్రమం అయినా సజావుగా సాగాలంటే.. అక్కడ పోలీసులు ఉండి పరిస్థితులను చక్కదిద్దాంల్సిందే. అయితే, వారికి వీక్లీ ఆఫ్ ఇవ్వాలని నిర్ణయించారు తమిళనాడు సీఎం స్టాలిన్.. తమిళనాడు పోలీసులకు దీపావళి కానుకగా వీక్లీ ఆఫ్ను తప్పనిసరి చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి స్టాలిన్.. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన కూడా విడుదల…
తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో నవ దంపతులు మృతిచెందడం ఇరు కుటుంబాలలో తీరని శోకం నెలకొంది. వివరాలలోకి వెళితే.. తమిళనాడులోని అరక్కోణానికి చెందిన మనోజ్ కుమార్ (31)కు, తాంబరం పెరుంగళత్తూరుకు చెందిన కార్తీక(30)కు నాలుగు రోజుల క్రితం అనగా అక్టోబర్ 28న ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్లి తరువాత పెరుంగళ్తూరు నుంచి అరక్కోణం నవ దంపతులు కారులో బయలుదేరారు. ముచ్చట్లు చెప్పుకుంటూ, కొత్త జీవితం గురించి మాట్లాడుకుంటూ వస్తున్న ఆ జంట…
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు మిగిలిన రాష్ట్రాల కన్నా భిన్నంగా ఉంటాయి. ఇప్పటికే కొత్తగా గెలిచిన సీఎం స్టాలిన్ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకెళ్తున్నారు. నూతన సంస్కరణలతో తన మార్కు పాలనను తమిళనాడు ప్రజలకు చూపిస్తున్నారు. పరిపాలనా పరమైన నిర్ణయాల్లోను, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో స్టాలిన్కు ఎవ్వరూ సాటిలేరు. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 18ని తమిళనాడు ప్రత్యేక రోజుగా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు…
డాక్టర్.. దేవుడి తరువాత దేవుడిలా కొలిచే మనిషి. ఎవరికి చెప్పుకోలేని బాధలను సైతం డాక్టర్ల వద్ద చెప్పుకుంటాము. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక డాక్టర్ ఆ పవిత్ర వృత్తికే కళంకం తెచ్చాడు. పవిత్రమైన వృత్తిలో ఉంటూ పాడుపనులు చేయడం మొదలుపెట్టాడు. వైద్యం కోసం వచ్చిన మహిళలకు మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. ఇటీవల హాస్పిటల్ కి వచ్చిన మహిళా డాక్టర్ దగ్గర కూడా తన నీచ బుద్దిని బయటపెట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేయడంతో…
సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కీర్తి కిరీటంలో తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో మరో కలికి తురాయి చేరింది. సహజంగా జాతీయ సినిమా అవార్డులను, పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందిస్తారు. అయితే ఇటీవల జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రజనీకాంత్ తో పాటు సినిమా రంగానికి చెందిన అవార్డు గ్రహీతలు పురస్కారాలను అందుకున్నారు. తాజాగా రజనీకాంత్, ఆయన శ్రీమతి లత న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను,…