ఇండియన్ ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది… తమిళనాడులోని కూనురు దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకోగా… ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు కొందరు సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తోంది… హెలికాప్టర్ ప్రమాదం తర్వాత రావత్ పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సి ఉండగా.. కోయంబత్తూర్ సూలూర్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి వెల్లింగ్టన్ ఆర్మీ బేస్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు..
ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌లో బిపిన్ రావత్ పాటు ఆయన భార్య సహా మొత్తం 9 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందుతుండగా… హెలికాప్టర్ కుప్పకూలిన తర్వాత మంటలు చెలరేగాయి.. మరోవైపు ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించింది ఇండిన్ ఎయిర్ ఫోర్స్. క్షతగాత్రులను ఆదుకునేందుకు కోయంబత్తూరు నుంచి వైద్యులు కూనూర్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది.. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఐఏఎఫ్ ఎంఐ-17వీ5గా గుర్తించారు.. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్.. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో 9 మంది ఉన్నట్టుగా తెలుస్తుండగా.. అందులో నలుగురు మృతిచెందినట్టు నీలగిరి కలెక్టర్ వెల్లడించారు.. అయితే, ఎవరు మృతిచెందారు అనే పూర్తి సమాచారం మాత్రం తెలియాల్సి ఉంది.