తమిళనాడులోని కునూరు నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది… ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌తో పాటు యాన భార్య మాలిక రావత్‌తో కొందరు ఆయన కుటుంబ సభ్యులు, ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది… అయితే, దీనిపై ఇప్పటి వరకు వెలువడిన రిపోర్టుల ప్రకారం.. 14 మంది ప్రయాణం చేస్తున్నారని.. మరో నివేదికలో 9 మంది మాత్రమే ఉన్నారనే చెబుతున్నారు. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఆక, ఘటనా స్థలంలో ఆర్మీ, పోలీసులు నిమగ్నమయ్యారు.
ప్రమాదంపై తక్షణ విచారణకు వాయుసేన ఆదేశించింది. కుప్పకూలిన హెలికాప్టర్ ఎన్నో క్షణాల్లోనే పూర్తిగా దగ్ధం అయినట్టు ఆ దృశ్యాలను చూస్తే తెలుస్తుండగా… బిపిన్ రావత్‌తో పాటు ఆయన భార్య ఆచూకీ కూడా తెలియడం లేదని సమాచారం.. అయితే, ఇప్పటికే ఏడుగురు మృతిచెందారని వార్తలు కూడా కలవర పెడుతున్నాయి.. మరోవైపు ఈ ఘటనతో వెంటనే కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశమైంది.. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని కేబినెట్ ముందు ఉంచిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఆ తర్వాత ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయల్దేరారు.