Chennai: అవినీతి రాణి.. మహిళా ఇన్‌స్పెక్టర్ కహానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chennai: అవినీతిని నిర్మూలించాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడుతున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలాంటి కొంతమంది వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కే చెడ్డపేరు వస్తోంది. ఇదిలా ఉంటే తమిళనాడులో ఓ మహిళా ఇన్‌స్పెక్టర్ భారీ అవినీతికి తెరలేపింది. అయితే ఆమె అవినీతిపై మొత్తం పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఉన్నతాధికారులను మచ్చిక చేసుకోవడానికి కూడా ప్రయత్నించింది. వారి మొప్పు పొందుతూనే.. మరోవైపు లంచాల రూపంలో భారీగా ఆస్తులు కూడబెట్టింది. చివరకు విచారణలో దొరికి ఉద్యోగం పోగొట్టుకుంది.
Read Also: Aishwarya Rajinikanth: ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం.. దొరికిన దొంగలు..
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
మహిళా ఇన్‌స్పెక్టర్ రాణి రోడ్డు ప్రమాదాల్లో బాధితుల నుంచి భారీగా లంచాలు తీసుకునేది. సదరు ఇన్‌స్పెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని పలు సంఘాల నుంచి డిమాండ్లు వచ్చాయి. ఈ లేడీ ఇన్‌స్పెక్టర్ బాగోతంపై పోలీస్ శాఖ దృష్టి సారించింది. విచారణ చేస్తే ఆమె అవినీతి, అక్రమాలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు రాణిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంటులో చర్చనీయాంశంగా మారింది.
ఆమె అవినీతిపై ఉన్నతాధికారులు ఏడు నెలల సస్పెండ్ విధించగా.. తాజాగా ఆమెను మంగళవారం సర్వీస్ నుంచి తొలగించారు. ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో రాణి ఇన్‌స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. గతేడాది ఆగస్టులో లంచం ఆరోపణతో సస్పెన్షన్ కు గురయ్యారు. ఆరోపణలపై తాంబరం పోలీస్ కమీషనర్ అమల్ రాజ్ విచారణకు ఆదేశించారు. లంచం కావాలని వేధిస్తోందంటూ ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ రాణి అవినీతి బయటకు వచ్చింది. యాక్సిడెంట్ కేసుల్లో ఇన్సూరెన్స్ చెల్లింపుల్లో అవినీతికి పాల్పడినట్లు తేలింది. ఆమె సొంతంగా న్యాయవాదులను ఏర్పాటు చేసుకుంది, బాధితుడితో ఒప్పందం కుదుర్చుకుని కేసు వాదించేలా చేసేది. బీమా సొమ్ములు రాగానే అందులోంచి డబ్బులు వసూలు చేసేది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!