Udhayanidhi Stalin: డీఎంకే పార్టీ యువనేత, ఆ రాష్ట్ర మంత్రి, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష అన్నాడీఎంకే, బీజేపీ కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎంకే పార్టీ ఆధ్వర్యంలో కోయంబత్తూర్ లో ఆదివారం సామూహిక వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయనిధి హాజరయ్యారు. సీఎం ఎంకే స్టాలిన్ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ ఖర్చుతో 81 జంటలకు పెళ్లి జరిపించారు. కొత్తగా పెళ్లైన దంపతును ఉద్దేశించి మాట్లాడారు.. మీరు ఎవరి కాళ్లపై పడొద్దని సూచించారు.
మీరెవ్వరికి బానిసలు కాదని, కాబట్టి దీన్ని ఆత్మగౌరవ వివాహం అంటారని.. మీ హక్కులను డిమాండ్ చేసి పొందండి, ఇంకా చెప్పాలంటే అన్నాడీఎంకే, బీజేపీ పార్టీల లాగా ఉండకండి అంటూ ఇరు పార్టీల పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎదుటివారి కాళ్ల మీద పడకండి అంటూ వ్యగ్యాస్త్రాలు సంధించారు ఉదయనిధి స్టాలిన్. పిల్లలు పుట్టినప్పుడు వారికి తమిళ పేర్లను పెట్టాలని దండపతును అభ్యర్థించారు. మీకు పుట్టిన బిడ్డ ఎవరైనా సరే.. స్వచ్ఛమైన తమిళపేర్లను పెట్టండి అని కోరారు. హిందీ భాషను ఆపాలంటే మనం ఇలాంటివి చేయాలని అని అన్నారు. అంతకుముందు ఒక కళ్యాణమండప ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా అన్నాడీఎంకేపై విమర్శలు గుప్పించారు. కొత్తగా పెళ్లైన జంటలు పన్నీర్ సెల్వం(ఓపీఎస్), ఎడప్పాడి పళన స్వామి(ఈపీఎస్)లా జీవించవద్దని సలహా ఇచ్చారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని ఓ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవల తండ్రి క్యాబినెట్ లో స్పోర్ట్స్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కొడుకును క్యాబినెట్ లోకి తీసుకోవడంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీ చీఫ్ అన్నామలై , స్టాలిన్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు.