DMDK President Vijayakanth Discharged from hospital: ప్రముఖ తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు, కెప్టెన్ విజయ్‌కాంత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చెన్నైలోని మియాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. పూర్తిగా కోలుకోవడంతో సోమవారం ఆయన డిశ్చార్జ్ అయ్యారు. 71 ఏళ్ల విజయ్‌కాంత్ అనారోగ్య కారణాల వల్ల నవంబర్ 18న ఆసుపత్రిలో చేరారు. 23 రోజుల తర్వాత కోలుకున్న కెప్టెన్.. నేడు చెన్నైలోని తన నివాసానికి వెళ్లిపోయారు. విషయం తెలిసిన విజయ్‌కాంత్ ఫాన్స్, డీఎండీకే కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో విజయకాంత్‌ను ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. డయాబెటిస్ కారణంగా గతంలో కెప్టెన్ కుడికాలి మూడు వేళ్లని తొలగించారు. గతకొంతకాలంగా 71 ఏళ్ల విజయ్‌కాంత్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనారోగ్యంతో కొద్దిరోజులుగా అయాన పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడంతో.. కెప్టెన్ భార్య ప్రేమలత ముందుండి పార్టీ వ్యవహారాలను చక్కబెడుతున్నారు.
Also Read: IND vs SA: బీసీసీఐ అంత కాకపోయినా.. కవర్స్ కొనేంత డబ్బు దక్షిణాఫ్రికా వద్ద లేదా?
2020 సెప్టెంబర్ నెలలో విజయకాంత్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. 10 రోజుల చికిత్స తర్వాత ఆయన మహమ్మారి నుంచి కోలుకున్నారు. రెండేళ్ల క్రితం విజయకాంత్ సింగపూరులో చికిత్స చేయించుకున్నా పూర్తిగా కోలుకోలేదు. విజయకాంత్ ఆరోగ్యం గురించి ఆయన సతీమణి ప్రేమలత ఎప్పటికప్పుడు అభిమానులకు సమాచారం ఇస్తున్నారు.