తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఆదివారం రాత్రి కోయంబత్తూరు విమానాశ్రయం సమీపంలో ముగ్గురు సభ్యుల ముఠా విద్యార్థినిని అపహరించి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. విద్యార్థిని స్నేహితుడితో కలిసి కారులో వెళ్తుండగా ముగ్గురు సభ్యుల ముఠా అపహరించింది. వేరే ప్రదేశానికి తీసుకుని గ్యాంగ్‌రేప్‌కు తెగబడ్డారు.
ఇది కూడా చదవండి: PM Modi: ఏఐ శక్తిని ఉపయోగకరంగా మారుస్తాం.. అభివృద్ధిలో లక్ష్యాన్ని ఛేదిస్తామన్న మోడీ
యువతిపై లైంగిక దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఏడు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. పురోగతి తర్వాత మరింత సమాచారాన్ని తెలియజేస్తామని చెప్పారు. సీసీటీవీలను పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సంఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. అధికార పార్టీపై విపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. తమిళనాడులో మహిళలపై లైంగిక నేరాలు పెరిగిపోతున్నాయని ధ్వజమెత్తాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించాయి.
ఇది కూడా చదవండి: India-Afghanistan: బలపడుతున్న భారత్-ఆప్ఘని బంధం.. ఢిల్లీలో తాలిబన్ దౌత్యవేత్త నియామకానికి ఏర్పాట్లు
కోయంబత్తూరు ఘటన చాలా దిగ్భ్రాంతికరం అని బీజేపీ నేత అన్నామలై అన్నారు. ‘‘తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై నేరాలు పెరిగిపోయాయి. సామాజిక వ్యతిరేక శక్తులకు చట్టం లేదా పోలీసుల పట్ల ఎలాంటి భయం లేదని స్పష్టంగా చూపిస్తున్నాయి. డీఎంకే మంత్రుల నుంచి చట్ట అమలు సిబ్బంది వరకు, లైంగిక నేరస్థులను రక్షించే స్పష్టమైన ధోరణి ఉంది.’’ అని అన్నామలై ఎక్స్‌లో రాసుకొచ్చారు.
కోయంబత్తూరు సంఘటన దురదృష్టకరమని డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా అన్నారు. నేరస్థులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కేసులో కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.