DMK: డీఎంకే ప్రభుత్వం బీహార్ ప్రజల్ని వేధిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించిన ఒక రోజు తర్వాత, డీఎంకే పార్టీ ప్రధానిపై విరుచుకుపడింది. డీఎంకే కార్యదర్శి ఆర్ఎస్ భారతీ ప్రధాని మోడీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమిళనాడును అవమానించిందని, నిధుల కేటాయింపులో రాష్ట్రం పట్ల కేంద్ర వివక్ష చూపుతోందని ఆరోపించారు. మోడీవి విభజన రాజకీయాలని, బ్రిటీష్ పాలన కన్నా దారుణంగా ఉందని ఆయన విమర్శించారు.
Read Also: JD Vance – Usha: అమెరికా ఉపాధ్యక్షుడి లవ్ ఎఫైర్.? అందుకే, భార్య హిందూ మతం గురించి కామెంట్స్..
కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒకసారి తమిళ ప్రజలు నాగరికత లేని వారు అని చెప్పారని, ఒక బీజేపీ ఎంపీ దక్షిణాది ప్రజలను ‘‘నల్లజాతీయులు’’ అని అభివర్ణించారని, తమిళులు, ఆఫ్రికన్ అమెరికన్ల మధ్య పోలికలు చూపించారని భారతి అన్నారు. బెంగళూర్ లోని ఒక హోటల్‌లో దాడి జరిగినప్పుడు కర్ణాటకకు చెందిన బీజేపీ మహిళా మంత్రి తమిళులు బాంబు పెట్టారని ఆరోపించారని కూడా గుర్తు చేశారు. మీ దృష్టిలో తమిళులు అంత తక్కువ వారా.?? అని ప్రశ్నించారు.
డీఎంకే అధికారంలో ఉన్నందుకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని భారతి ఆరోపించారు. తమిళనాడు అందించే ప్రతి రూపాయికి 29 పైసలు మాత్రమే ఇస్తోందని, బీహార్ నుంచి రూ.7 ఇస్తుున్నారని భారతి అన్నారు. బీజేపీ 15 ఏళ్ల సంకీర్ణంతో బీహార్‌ను పాలించిందని, వారు ఇంకా అభివృద్ధి చెందారా..? అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.