TVK Chief Vijay: తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో గెలుపే లక్ష్యంగా తమిళగ వెట్రి కజగం పార్టీ ముందుకు సాగుతుంది. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత సూమారు రెండు నెలల తర్వాత ప్రజల్లోకి వచ్చాడు నటుడు విజయ్. కాంచీపురంలోని ఓ ప్రైవేట్ ఆడిటోరియంలో.. స్థానిక సమస్యలపై ప్రజలతో ముఖాముఖి సమావేశం అయ్యారు. కరూర్ తొక్కిసలాట దృష్ట్యా పోలీసుల ఆంక్షలు విధించడంతో.. కేవం రెండు వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పూర్తి సహకారం అందిస్తాం.. శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటామని పోలీసుల తెలిపారు.
Read Also: Viral Hospital Reel:ఆస్పత్రిలో రీల్స్ చేస్తున్న యువకుడు.. మందలించేందుకు వచ్చిన డాక్టర్ కూడా..
ఈ నేపథ్యంలో కాంచీపురంలో ప్రజలతో ముఖాముఖిలో టీవీకే చీఫ్ విజయ్ మాట్లాడుతూ.. 12 హామీలను సభలో ప్రస్తావించారు. రాష్ట్రంలో వరదలు ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. ప్రజలందరికీ సొంతిల్లు, ప్రతి ఇంటికి ఒక బైక్ ఉండాలన్నదే తన లక్ష్యం అన్నారు. అందుకు ప్రజల్లోకి వచ్చాను, మీ కోసం పోరాటం చేస్తున్నానని పేర్కొన్నారు. డీఎంకే తమకు రాజకీయ ప్రత్యర్థి, బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి అని విజయ్ దళపతి చెప్పుకొచ్చారు.
అయితే, ఎంజీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఓ కులానికి చెందిన పార్టీ ముద్ర వేయాలని కొందరు చూశారని తమిళగ వెట్రీ కజగం అధినేత విజయ్ తెలిపారు. పార్టీ లాగేసుకోవాలని చూశారు.. కానీ, ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదన్నారు. అలాగే, వచ్చే ఎన్నికల్లో DMK ఓటమి తథ్యం అని జోస్యం చెప్పారు. పాలారు నదిలో కోట్లాది రూపాయల ఇసుకను దోచేశారు.. ఇసుక దోపిడీ సహా ఎన్నో రకాలుగా డీఎంకే ప్రభుత్వం అవినీతికి పాల్పడింది.. విజయ్ తో ఎందుకు పెట్టున్నామా అని తలచుకుని తలచుకుని బాధపడుతారు.. ఆ రోజు త్వరలోనే వస్తుందని టీవీకే చీఫ్ పేర్కొన్నారు.