Tamil Nadu BJP: 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా “సైలెంట్ ఆపరేషన్” నిర్వహిస్తున్నారని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తెలిపారు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన షాను చూసి డీఎంకే భయపడుతోంది అని అన్నారు. అలాగే, పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్ నిర్వహించినట్లే, అమిత్ షా ఇప్పుడు మీనాక్షి అమ్మవారిని సందర్శించి, సింధూర్‌ను తీసుకెళ్లి, డీఎంకే పాలనను అంతం చేయడానికి ‘సైలెంట్ ఆపరేషన్’ ప్రారంభిస్తారు అని నైనార్ నాగేంద్రన్ చెప్పుకొచ్చారు.
Read Also: Gadikota Srikanth Reddy: రాయచోటి ఓటింగ్ పై మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!
అయితే, బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమిని “ద్రోహీ కూటమి” అని డీఎంకే పిలవడం హస్యస్పదంగా ఉందని తమిళనాడు బీజేపీ చీఫ్ నాగేంద్రన్ ఆరోపించారు. డీఎంకే గతంలో ఇందిరా గాంధీపై రాళ్లు రువ్వి ఆమెను రక్తం వచ్చేలా చేశారు.. ఇప్పుడు వారు ద్రోహం గురించి మాట్లాడుతున్నారా? అని మండిపడ్డారు. కాగా, తమిళనాడులోని కొంగు ప్రాంతంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించాయి.. వృద్ధులను హత్య చేస్తున్నారు.. ఇప్పటి వరకు నిందితులు 19 హత్యలు చేసినట్లు అంగీకరించారు.. ఈ ప్రభుత్వం, పోలీసు శాఖను నిర్వహించడంలో విఫలమైంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, రాష్ట్రంలో మహిళలపై లైంగిక వేధింపుల సంఘటనలు క్రమంగా పెరుగుతున్నాయి.. కానీ, సరైన చర్యలు తీసుకోవడం లేదు.. ఇవన్నీ 2026లో ముగిసిపోతాయని నైనార్ నాగేంద్రన్ వెల్లడించారు.
Read Also: Anantapur: ప్రేమ వ్యవహారమే యువతీ దారుణ హత్యకు కారణమా..?!
ఇక, ఎన్డీయే భాగస్వామ్యంలో బీజేపీ- ఏఐడీఎంకేతో కలిసి పని చేస్తుందని బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. కూటమిని ఏర్పాటు చేసింది అమిత్ షా.. 2026లో EPS నాయకత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుంది అని తేల్చి చెప్పారు. అలాగే, నేను ఎలాంటి యాత్ర చేస్తానో దానికి సంబంధించి ప్లాన్ రెడీ చేస్తున్నాను.. త్వరలోనే అన్ని విషయాలను తెలియజేస్తా.. మా ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తీసుకెళ్లడమే నా యాత్ర.. జూన్ 22వ తేదీన, తిరుపరంకుండ్రంలో మురుగన్ భక్తుల సమావేశం నిర్వహిస్తామని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్రన్ పేర్కొన్నారు.