తాలిబన్లకు బగ్లాన్ ప్రావిన్స్ కొరకరాని కొయ్యగా మారింది. 2001 కి ముందు కూడా ఈ ప్రావిన్స్‌లోకి తాలిబన్లు అడుగుపెట్టకుండా అప్పటి స్థానిక దళాలు అడ్డుకున్నాయి. తీవ్రంగా పోరాటం చేశాయి. ఇప్పుడు కూడా ఈ ప్రావిన్స్‌లోకి అడుగుపెట్టనివ్వకూడదని స్థానిక దళాలు నిర్ణయం తీసుకొని పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే మూడు జిల్లాలను తాలిబన్ల చెర నుంచి విడిపించారు. అయితే, తాలిబన్లు కాబూల్ ఆక్రమణ తరువాత శాంతిని కోరుకుంటున్నామని, అందరినీ క్షమించివేశామని చెబుతున్నారు. అయినప్పటికీ తాలిబన్ల మాటలను అక్కడి ప్రజలెవరూ కూడా…
ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. తాలిబన్ల ఆక్రమణలతో ప్రజలు భీతిల్లిపోతున్నారు. ఎటునుంచి ఎవరు దాడులు చేస్తారో అని ప్రాణాలు గుప్పిట పట్టుకొని దొరికిన విమానం పట్టుకొని దేశం విడిచి పారిపోతున్నారు. సామాన్యులతో పాటుగా ఆఫ్ఘన్ నేతలు కూడా వివిధ దేశాలకు పారిపోతున్నారు. గత ప్రభుత్వంలోని నేతలను ఏమి చేయబోమని తాలిబన్లు హామీ ఇస్తున్నా, వారి హామీలను ఎవరూ నమ్మేస్థితిలో లేరనే సంగతి తెలిసిందే. ఇలా ఆఫ్ఘన్ నుంచి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వచ్చిన ఎంపీ నరేందర్ సింగ్…
2001 నుంచి ఇరవై ఏళ్లపాటు అమెరికా లక్షల కోట్ల రూపాయలను ఆఫ్ఘనిస్తాన్‌లో సైన్యం కోసం పెట్టుబడులు పెట్టింది. విలువైన, అధునాతనమైన ఆయుధాలు సమకూర్చింది. అయినప్పటికీ కేవలం 11 రోజుల్లోనే ఆఫ్ఘన్ సేనలు తాలిబన్లకు లొంగిపోయారు అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకొవచ్చు. మూడు లక్షలకు పైగా ఆఫ్ఘన్ సేనలు ఉన్నాయని, వారంతా బలంగా ఉన్నారని, అమెరికా సైన్యం వారికి అద్భుతమైన శిక్షణ ఇచ్చిందని సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ఆయన చెప్పిన దానికి, అక్కడ…
కాబూల్ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం రోజులుగా అమెరికాతో సహా అనేక దేశాలు తమ పౌరులను, ఆఫ్ఘనిస్తాన్ పౌరులను వివిధ దేశాలకు తరలిస్తున్నాయి. తాలిబన్ల భయంలో ఆఫ్ఘన్ ప్రజలు వివిధ దేశాలకు తరలివెళ్తున్నారు. ఎలాగైనా ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తున్నారు. అయితే, గత రెండు రోజులుగా కాబూల్ నగరం నుంచి ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్లేవారిపై తాలిబన్లు దృష్టిసారించారు. ఎయిర్‌పోర్టువైపు వెళ్తున్న వారిపై దాడులు చేస్తున్నారు. కాల్పులు జరుపుతున్నారు. తాజాగా ఈరోజు మరోసారి తాలిబన్లు కాల్పులకు…
తాలిబన్లు తొలి ఫత్వా జారీ చేశారు. అనుకున్నదే అయ్యింది. తాలిబన్ల రాక్షసత్వం బయటపడింది. ప్రపంచం ముందు మహిళలకు గౌరవం ఇస్తామని చెబుతున్న తాలిబన్లు.. క్షేత్రస్థాయిలో తమ రాక్షసత్వాన్ని బయటపెడుతున్నారు. రాతియుగం నాటి షరియత్ చట్టాలను ఆప్ఘన్ ప్రజల మీద రుద్దడం మొదలు పెట్టారు. మహిళలపై ఉక్కుపాదం మోపే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా హెరాత్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ- ప్రైవేటు విద్యాసంస్థల్లో కో- ఎడ్యుకేషన్‌ను రద్దు చేస్తూ తొలి ఫత్వాను జారీ చేశారు. సమాజంలో దుర్మార్గాలకు ఆడ-మగా కలిసి…
అఫ్ఘానిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకొన్న కొద్ది రోజుల్లోనే తాలిబన్ల పాలన ఎంత దారుణంగా ఉంటుందో ప్రపంచానికి తెలుస్తోంది. కాబుల్‌లో అడుగడుగునా మోహరించిన తాలిబన్లు విధ్వంసాలకు తెగబడుతున్నారు. ఇదిలావుంటే, అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల పాలనను తాము గుర్తించలేదని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు అర్సులా వాన్ డెర్ లియన్ తెలిపారు. తాలిబన్లతో ప్రస్తుతం ఎటువంటి చర్చలు జరపట్లేదని, అది అనవసరం కూడా అని ఆమె స్పష్టం చేశారు. అఫ్ఘానిస్థాన్ నుంచి తిరిగొచ్చిన ఐరోపా సమాఖ్య ఉద్యోగుల కోసం మాడ్రిడ్ నగరంలో ఏర్పాటు చేసిన…
కరోనా ప్యాండమిక్ లో ఎంతోమంది ఆపన్నులను ఆదుకున్న ప్రముఖ నటుడు సోనూ సూద్ మరోమారు తన మంచిమనసు చాటుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అక్కడ ఎంతోమంది యుద్ధం కారణంగా నిరాశ్రయులైనారు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ తనదైన రీతిలో స్పందించారు. తాలిబన్లతో పోరాటం సాగించిన ఆఫ్ఘన్ పట్టణాలలో జనజీవనం అతలాకుతలమైందని, అలాంటి వారిని ఆదుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉందని సోనూ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అలాగే అక్కడ నివాసమున్న ఎంతోమంది…
ఇక యుద్ధం ముగిసింది అని ప్రకటించిన తాలిబన్లు.. ఆ తర్వాత తమ ప్రకటనకు విరుద్ధంగా డోర్ టు డోర్ తనిఖీలు నిర్వహిస్తూ అందరనీ ఆశ్చర్య పరిచారు.. మరోవైపు.. ఇప్పుడు దాదాపు 150 మందిని కిడ్నాప్ చేసి మరింత రెచ్చిపోయారు. కాబూల్ సైతం తాలిబన్ల వశం కావడంతో.. భారత్ సహా చాలా దేశాలు.. ఆఫ్ఘన్‌లోని రాయబార కార్యాలయాలను ఖాళీ చేసి.. స్వదేశాలకు తరలిపోయాయి. ఖాళీగా ఉన్న కార్యాలయాల్లోకి చొర్రబడి దౌత్యపత్రాలు ఏమైనా దొరుకుతాయేమోనని తాలిబన్లు తనిఖీలు కూడా నిర్వహించారు.…
క్రమంగా తాలిబన్లకు కూడా మద్దతు పెరుగుతుందా? అంటే అవుననే చెప్పాల్సిన పరిస్థితి వస్తుందో.. ఎందుకంటే.. ఆఫ్ఘనిస్తాన్‌ను ఇప్పటికే పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లపై మెజార్టీ దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా.. కొన్ని దేశాలు వారికి కూడా మద్దతుగా మాట్లాడుతున్నాయి.. ఇప్పటికే డ్రాగన్ కంట్రీ చైనా.. తాలిబన్లతో దోస్తీకి సిద్ధమని ప్రకటిస్తే.. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం వారికి మద్దతు పలికారు.. ఇక, రష్యా కూడా వారికి మద్దతు ఇచ్చే విధంగా మాట్లాడింది.. తాజాగా, బ్రిటన్…