ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్లు అక్రమించుకొని పదిరోజులైంది. అధికార బదలాంపు ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్టు సమాచారం. ఆఫ్ఘన్ అధ్యక్షుడిగా ముల్లా బరాదర్ ను నియమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన పేరు ముందు వరసలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కీలకమైన రక్షణ, ఆర్ధిక శాఖలను తాలిబన్లకు నమ్మకమైన వ్యక్తులకు అప్పటించబోతున్నారని సమాచారం. గతంలో అమెరికాలోని గ్వాంటెనామో బే జైల్లో ఖైదీగా శిక్షను అనుభవించిన ముల్లా అబ్దుల్ ఖయ్యుం జకీర్‌కు అప్పగించబోతున్నారని సమాచారం. 2001లో అమెరికా దళాలు తాలిబన్లపై దాడి…
కరుడు గట్టిన తాలిబన్ల తీరు మారుతుందా? ఇకనైనా పద్దతి మార్చుకుంటారా? మాటకు కట్టుబడి ఉంటారా! అలా జరుగుతుందంటే ఎవరైనా నమ్ముతారా? చస్తే నమ్మరు. తాలిబన్ల ట్రాక్ రికార్డ్ అటువంటిది మరి. అందుకే ఆఫ్గనిస్తాన్ పొరుగు దేశాల్లో గుబులు మొదలైంది. ఒక్క పాకిస్తాన్‌కు మాత్రమే ఆ భయం లేదు. తాలిబాన్ అనే పాముకు పాలు పోసి పెంచింది అదే కదా! తాలిబన్ల విజయం చూసి పాకిస్తాన్ పండగ చేసుకుంటోంది. కానీ .. ఏదో ఒక రోజు దానిని కూడా…
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల అరాచక పాలన సాగుతున్నది. ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. వ్యాపార సంస్థలను తెరవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు వ్యాపారులు. చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. బడా వ్యాపారవేత్తలు అక్కడే ఉంటే ప్రాణాలతో ఉండలేమని చెప్పి ముందుగానే దేశం వదిలి వెళ్లిపోయారు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో కూడా ఓ వ్యక్తి నిర్వహిస్తున్న వ్యాపారం దివ్యంగా సాగుతున్నది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నది. ఆఫ్ఘనిస్తాన్‌లో అజీజ్ గ్రూప్‌కు మంచి…
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. వీలైతే ఎలాగైనా ఎయిర్‌పోర్టుకు చేరుకొని ఏదోక విమానం ఎక్కి అక్కడి నుంచి బయటపడాలని చూస్తున్నారు. ఇక, ఆగస్టు 31 వరకు తాలిబన్లు ఎయిర్‌పోర్టులోని అమెరికా, నాటో దళాలకు డెడ్‌లైన్ విధించారు. ఆగస్టు 31 లోగా దేశం విడిచి వారంతా వెళ్లిపోవాలని షరతు విధించారు. అందుకు తగ్గట్టుగానే అమెరికా, నాటో దళాలు ప్రజలను తరలిస్తున్నాయి. అయితే, వేల సంఖ్యలో కాబూల్ ఎయిర్‌పోర్టుకు కొత్త వ్యక్తులు…
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. గత వారం రోజులుగా సామాన్య ప్రజలపై తాలిబన్లు విరుచుకుపడుతున్నారు. కాల్పులు జరుపుతున్నారు. శాంతి మంత్రం వల్లెవేస్తూనే, అరాచకాలు సృష్టిస్తున్నారు. మీడియాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే విదేశీ మీడియా సంస్థలు, ప్రతినిధులు, జర్నలిస్టులు ఆ దేశాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. స్థానికంగా ఉన్న మీడియా క్షణక్షణం భయం భయంగా వార్తలను అందిస్తోంది. తాలిబన్లకు వ్యతిరేకంగా ఎలాంటి వార్తలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని చేస్తున్నప్పటికీ వారి అరాచకాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా, స్థానిక…
తాలిబన్లు రెండోసారి ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్నారు. 1994లో మొదటిసారి తాలిబన్లు ఆఫ్ఘన్ దురాక్రమణకు పూనుకోవడం, 1996లో అధికారంలోకి రావడంతో ఆక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చెప్పక్కర్లేదు. ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే కాకుండా పాక్‌లోనూ తాలిబన్లు వారి ఉనికిని చాటుకున్నారు. 9 ఏళ్ల క్రితం తాలిబన్లు పాక్‌లోని క్వెట్టా ప్రాంతంలోకి ప్రవేశించి స్కూల్ బస్సుపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో విద్యార్ధిని మలాలా యూసెఫ్‌జాయ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ తరువాత ఆమెను పెషావర్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అక్కడి…
పచ్చి నెత్తురు తాగే పెద్ద పులి పచ్చిగడ్డి తింటుందంటే నమ్ముతారా? తాలిబన్లు కూడా అంతే. ఆఫ్గనిస్తాన్‌లో మళ్లీ అరాచకాలు మొదలయ్యాయి. హాలీ మెక్ కే అనే అమెరికా జర్నలిస్టు తాలిబన్ల ఘాతుకాలను కళ్లారా చూసింది. డల్లాస్ మార్నింగ్ న్యూస్ కోసం పని చేస్తున్న ఆమె ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకోగలిగింది. ఆమె చెప్పిన దాన్ని బట్టి ..చూసిన దాన్ని బట్టి ..ఆఫ్గన్ మహిళలపై తాలిబన్లు దారుణాలకు పాల్పడతున్నారు. దాంతో ఇన్నాళ్లూ స్వేచ్చగా జీవించిన అమ్మాయిల బతుకులు ఇప్పడు…
ఇప్పుడు ప్రపంచం దృష్టంతా ఆఫ్ఘనిస్థాన్.. అక్కడ తాలిబన్ల పాలనపైనే ఉంది. ఈసారి ఇండియాలో ఉన్న తాలిబన్ క్రికెట్ టీమ్ వార్తల్లో నిలిచింది. రాజస్థాన్‌లో తాలిబన్ క్రికెట్ క్లబ్ పేరుతో ఓ టీమ్ ఉంది. ఆ రాష్ట్రంలోని జైసల్మేర్‌లో ఉన్న భనియానా గ్రామంలో జరుగుతున్న టోర్నీలో ఈ క్లబ్ ఓ మ్యాచ్ కూడా ఆడింది. అయితే ఆ తర్వాత ఈ క్లబ్ పేరుపై వివాదం చెలరేగడంతో… నిర్వాహకులు ఆ టీమ్‌పై నిషేధం విధించారు. అసలు టోర్నీలో ఈ టీమ్‌ను…
ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఆఫ్ఘనిస్థాన్ పైనే ఉంది. అయితే తాలిబన్ల సమస్యతో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ కూడా ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పటికే యూఏఈ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్న టీ 20 ప్రపంచ కప్ కు ఆఫ్ఘన్ జట్టు అర్హత సాధించిన విషయం తెలిసిందే. దాంతో ఈ టోర్నీలో ఆ జట్టు పాల్గొంటుందా.. లేదా అని అనుకుంటున్న సమయంలో తాలిబన్లు అందరికి షాక్ ఇచ్చారు. తాజాగా ఆఫ్ఘన్ క్రికెట్ జట్టు కెప్టెన్ అలాగే క్రికెట్ బోర్డు సభ్యులతో తాలిబన్ అధ్యక్షుడు…