వెనక్కి వెళ్ళే హడావుడిలో అమెరికా పెద్ద తప్పే చేసింది. తన ఆయుధ డంపులను అఫ్గాన్‌లోనే వదిలేసింది. ఈ నిర్లక్ష్యం తాలిబన్లకు వరంగా మారింది. సుల్తాన్‌ఖిల్ సైనిక స్థావరంలోని కంటైనర్ల కొద్దీ ఆయుధాలు, వాహనాలు తాలిబన్ల సొంతమయ్యాయి. అప్ఘాన్ సేన కోసం అమెరికా ఇరవైఏళ్లుగా అనేక ఆధునాతన ఆయుధాలను భారీగా సమకూర్చింది. అమెరికా భాగస్వామ్యంలో అందించిన బోలెడు ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు, ఎన్నో సైనిక మౌలిక వసతులు తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఇంతకాలం అందని వైమానిక సంపత్తి…
ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల వశం అయింది. రాజధాని కాబూల్‌ను ఆక్రమించుకోవడంతో తాలిబన్లు పాలనలోకి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిపోయింది. రాజధానిలో అరాచకాలు జరుగుతున్నాయి. కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద తాలిబన్లు తెగబడుతున్నారు. ఎయిర్‌పోర్ట్ వైపు వెళ్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఒకవైపు ఇలా ఉంటే, ఆఫ్ఘన్ ఆర్మీ పక్కకు తప్పుకున్నా, స్థానిక ప్రజలు ప్రత్యేక దళాలుగా ఏర్పడి తాలిబన్లతో పోరాటం చేస్తునన్నారు. బగ్లాన్ ప్రావిన్స్‌లోని స్థానిక దళాలు తాలిబన్లపై తీవ్రంగా పోరాటం చేస్తున్నాయి. స్థానిక దళాల చేతిలో అనేకమంది…
తాలిబన్లు ఎంతటి కర్కశకులో చెప్పనలివి కాదు. మానవత్వం మచ్చుకైనా కనిపించదు. జాలి, దయ అన్నవి వారి నిఘంటువులో కనిపించవు. తెలిసందల్లా రక్తపాతం సృష్టించడం, ప్రజలకు భయపెట్టడం. బయటిప్రజలతోనే కాదు, ఇంట్లోని భార్య, బిడ్డలతో కూడా వారి ప్రవర్తన అలానే ఉంటుంది. దీనికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఇది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి నాలుగేళ్ల క్రితం చిన్న బిడ్డలను తీసుకొని పొట్ట చేత్తోపట్టుకొని ఇండియా వచ్చింది ఫరిభా అనే మహిళ. ఆఫ్ఘన్‌లో ఆమె ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నదో…
ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ప్రజాస్వామ్యానికి తావులేదని, షరియా చట్టం ప్రకారమే పాలన ఉంటుందని, అయితే, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని, మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తామని చెబుతూనే, వారిపై దాడులు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ జాతీయజెండాను ప్రదర్శిస్తున్న పౌరులపై కాల్పులు జరుపుతున్నారు. ముష్కరుల పాలన ఎలా ఉండబోతుందో చెప్పేందుకు ఇది కేవలం ఓ ఉదాహరణ మాత్రమే. ఇక ఆఫ్ఘనిస్తాన్‌లోని రాయబార కార్యాలయాలను ఇప్పటికే ఇండియా ప్రభుతవం మూసేసింది. కాబూల్, హెరాత్, కాందహార్‌లో భారత రాయబార కార్యాలయాలు…
ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఆగస్టు 15 కి ముందు ఆ కాబూల్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆగస్టు 15 తరువాత పరిస్థితులు ఎలా మారిపోయాయో అందిరికి తెలిసిందే. ఆగస్టు 15కి ముందు కాబూల్ నగరంలో యువత చాలా మోడ్రన్‌గా కనిపించేవారు. జీన్స్, టీషర్ట్ తో పాశ్ఛాత్య సంస్కృతికి ఏ మాత్రం తీసిపోకుండా కనిపించేవారు. 24 గంటలు ఆ నగరంలో బయట యువత సంచరించేవారు. అయితే, ఆగస్టు…
తాలిబన్లపై ఆది నుంచి అనుమానాలే.. వారు చెప్పేది ఒకటైతే.. చేసేది మరోలా ఉంటుందనే వాదన ఇప్పటిది కాదు.. ఇప్పుడు అదే జరుగుతోంది.. ఆఫ్ఘన్‌నిస్థాన్ ను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్న తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన తాలిబన్ల ప్రతినిధులు.. ఇక యుద్ధం ముగిసిందని.. అందరనీ క్షమించేశాం.. ఇస్లాం చట్టాల ప్రకారం.. మహిళలకు కూడా రక్షణ కల్పిస్తాం వంటి.. మంచి మంచి మాటలు చెప్పుకొచ్చారు.. ఆ స్టేట్‌మెంట్ ఇచ్చి రెండు రోజులు గడిచిందో లేదు.. అప్పడే.. డోర్‌డోర్ తనిఖీలు చేపట్టారు…
తాలిబన్ల ఎంట్రీతో అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ… దేశాన్ని వదిలి పరారయ్యాడు.. ఇక, అప్పటి వరకు ఉపాధ్యక్షుడిగా ఉన్న అమ్రుల్లా సాలేహ్.. చట్టాల ప్రకారం తానే అధ్యక్షుడినంటూ ప్రకటించుకున్నాడు. మరోవైపు.. తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత వారికి షాకిస్తూ.. వారి ఖాతాలను నిలిపివేస్తూ.. వారి కంటెంట్‌ను తొలగించేందుకు.. కొత్త కంటెంట్‌పై నిఘా పెట్టేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఒక కొత్త టీమ్‌నే ఏర్పాటు చేసింది.. ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లోనూ వారి కంటెంట్‌పై బ్యాన్ విధించింది ఫేస్‌బుక్.. ఇప్పుడు…
ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. ప్రజాస్వామ్యానికి దేశంలో తావులేదని, షరియా చట్టం ప్రకారమే పరిపాలన సాగుతుందని ఇప్పటికే తాలిబన్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ ప్రజలు ప్రాణాలకు తెగించి తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. నిన్నటి రోజుక నిరసనకారులపై తాలిబన్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతిచెందగా, 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో పౌరులు పెద్దసంఖ్యలో రోడ్డుమీదకు వచ్చి జాతీయ జెండాలతో ర్యాలీని నిర్వహించారు. కాబూల్‌లోని…